రామ్‌లో ఎనర్జీ అన్‌లిమిటెడ్‌ | Ismart Shankar Pre release Event | Sakshi
Sakshi News home page

రామ్‌లో ఎనర్జీ అన్‌లిమిటెడ్‌

Jul 13 2019 5:42 AM | Updated on Jul 14 2019 10:21 AM

Ismart Shankar Pre release Event - Sakshi

నిధీ అగర్వాల్, రామ్, నభా నటేశ్, ఛార్మి, పూరి జగన్నాథ్‌

‘‘పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. రామ్‌లోని ఎనర్జీ అన్‌లిమిటెడ్‌. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత. నాకు చేతనైనంత వాడాను. ఇంకా బోలెడు ఎనర్జీ ఉంది. తను ఓ గ్రేట్‌ యాక్టర్‌. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’గా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాడు’’ అన్నారు పూరి జగన్నాథ్‌. రామ్‌ హీరోగా, నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’.  పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ– ‘‘మణిశర్మగారు మా సినిమాకు పెద్ద పిల్లర్‌. అడగ్గానే ఐదు పాటలు నా మొహాన కొట్టారు (నవ్వుతూ). రీసెంట్‌ టైమ్‌లో మంచి ఆల్బమ్‌ అని అందరూ అభినందిస్తున్నారు. నేపథ్య సంగీతం కూడా కుమ్మేశారు’’ అన్నారు. రామ్‌ మాట్లాడుతూ– ‘‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కోసం పని చేసిన ఈ ఆరు నెలలు నా లైఫ్‌లోనే బెస్ట్‌ టైమ్‌. ఈ సినిమాను రెండుగంటల పాటు ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు. సినిమాలో చాలా చేసినట్లు అనిపించింది కానీ.. సినిమా ఎలా పూర్తి చేశానో తెలియడం లేదు. ఆనీ మాస్టర్‌ కంపోజ్‌ చేసిన ‘ఉండిపో ఉండిపో..’ పాట ప్రేక్షకులను సీట్‌కు అలా కట్టేసి ఉంచుతుంది. మణిశర్మగారి పాటలన్నీ ఒక ఎత్తు అయితే.. రీరికార్డింగ్‌ మరో ఎత్తు.

నాకు సినిమా ఎంత నచ్చిందో చెప్పాను. నేను ఫీల్‌ అయిన దాంట్లో ప్రేక్షకులు ఒక శాతం ఫీల్‌ అయినా కూడా నాకు అదే వంద శాతం సంతృప్తి ఇచ్చినట్టవుతుంది.. ఇందుకు పూరికి థ్యాంక్స్‌ ’’ అన్నారు. ‘‘సినిమా ఫస్ట్‌ కాపీ చూశాం. మా నమ్మకం మరింత పెరిగింది.. చూసేవాళ్లకు ఫుల్‌ మీల్స్‌లాంటి సినిమా ఇది. రామ్‌ నటన చూసిన నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి. తను లేకుండా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ లేదు. పూరితో రామ్‌ మళ్లీ పనిచేయాలని అందరూ కోరుకునేలా సినిమా ఉంటుంది’’ అన్నారు ఛార్మికౌర్‌. ‘‘తక్కువ సమయంలోనే పూరిగారితో కలిసి పనిచేయడం ఆశీర్వాదంగా భావిస్తున్నాను’’ అన్నారు నిధీ అగర్వాల్‌. ‘‘పూరిగారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు నభా నటేశ్‌. డ్యాన్స్‌ మాస్టర్‌ ఆనీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement