తగ్గని ‘ఇస్మార్ట్ శంకర్‌’ హవా

iSmart Shankar Full Hindi Dubbed Movie Get Huge Views  - Sakshi

స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, ఎనర్జిటిక్‌ స్టార్ రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో గతేడాది వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్‌’ సినిమా హవా ఇంకా కొనసాగుతోంది. వరుస పరాజయాల నుంచి పూరి జగన్నాథ్‌ను బయటపడేసి భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా యూట్యూబ్‌లోనూ సత్తా చాటుతోంది. ఫిబ్రవరి 16న యూట్యూబ్‌లో పెట్టిన హిందీ వెర్షన్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. నాలుగు రోజుల్లో 50 మిలియన్ల వ్యూస్‌ (5 కోట్లకు పైగా) దక్కించుకుని దూసుకుపోతోంది. 8.6 లక్షల లైకులతో ప్రేక్షకాదరణ కొనసాగుతోంది. ‘ఇస్మార్ట్ శంకర్‌’ హిందీ వెర్షన్‌ను ఆదిత్య మూవీస్‌ యూట్యూబ్‌లో విడుదల చేసిన 24 గంటల్లోనే 2 కోట్ల వ్యూస్‌, 5 లక్షల లైకులు దక్కించుకోవడం విశేషం.


శివరాత్రికి స్పెషల్‌ షోలు
కాగా, శివరాత్రి సందర్భంగా ‘ఇస్మార్ట్ శంకర్‌’ మరోసారి ధియేటర్లలో సందడి చేయనున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని పలు ధియేటర్ల ప్రత్యేక షోలు ప్రదర్శించనున్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో స్పెషల్‌ షోలు ఉంటాయని ‘పూరి కనెక్ట్స్‌’ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. మరోవైపు సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ​ హీరోగా ‘ఫైటర్‌’ సినిమాను పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్నారు. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ సినిమాతో హిందీ తెరకు పరిచయమైన అనన్య పాండే హీరోయిన్‌గా నటించనుంది. (చదవండి: విజయ్‌ దేవరకొండతో అనన్యా పాండే)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top