ఇస్మార్ట్‌ శంకర్‌.. ‘దిమాక్‌ ఖరాబ్‌’ | Ismart Shankar First Lyrical Song Video Released | Sakshi
Sakshi News home page

ఇస్మార్ట్‌ శంకర్‌.. ‘దిమాక్‌ ఖరాబ్‌’

Jun 7 2019 6:26 PM | Updated on Jun 7 2019 6:55 PM

Ismart Shankar First Lyrical Song Video Released - Sakshi

ఎనర్జిటిక్‌ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. డబుల్ దిమాక్ హైదరాబాదీ అనేది ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ హీరోయిన్లు. ఈ సినిమాను జూలై 12న రిలీజ్‌ చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. దీంతో చిత్ర ప్రమోషన్లలో భాగంగా సినిమాలోని ఓ మాస్‌ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 

దిమాక్‌ ఖరాబ్‌ అంటూ సాగే పాటను ఈ రోజు సాయంత్రం చిత్రబృందం రిలీజ్‌ చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూత్‌తో పాటు మాస్‌ ఆడియన్స్‌కు తెగ కనెక్ట్‌ అయింది. మణిశర్మ సంగీతం .. కాసర్ల శ్యామ్ సాహిత్యం .. కీర్తన శర్మ - సాకేత్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. దీంతో పూరి జగన్నాథ్, హీరో రామ్‌ ఖాతాలో హిట్ పడటం ఖాయమనే అభిప్రాయంలో వారి అభిమానులు వున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement