ప్రేమంటే ప్రమాదం | Ishq Is Risk movie audio launch | Sakshi
Sakshi News home page

ప్రేమంటే ప్రమాదం

Oct 11 2019 1:36 AM | Updated on Oct 11 2019 1:36 AM

Ishq Is Risk movie audio launch - Sakshi

సాయిశ్రీవి

రవిచంద్ర, యుగా యుగేష్, సాయిశ్రీవి ముఖ్య పాత్రల్లో రాజ్‌ కింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇష్క్‌ ఈజ్‌ రిస్క్‌’. ఎస్‌.చంద్రశేఖర్‌ నిర్మించిన ఈ సినిమా పాటలను విడుదల చేశారు. నిర్మాత చంద్రశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘మా టీమ్‌ అంతా కష్టపడ్డాం అని అందరూ అంటున్నారు. ఎవరెంత కష్టపడ్డామన్నది సినిమా చూసి ప్రేక్షకులే నిర్ణయించాలి’’ అన్నారు. ‘‘ప్రతిభ ఉన్న దర్శకుడికి సరైన నిర్మాత కుదిరితే మంచి సినిమా వస్తుంది. అలా కుదిరిన సినిమాయే ‘ఇష్క్‌ ఈజ్‌ రిస్క్‌’’ అన్నారు సీనియర్‌ దర్శకుడు సాగర్‌. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు రవిచంద్ర. ‘‘హాస్యానికి పెద్ద పీట వేసిన చిత్రమిది. అందరికీ నచ్చుతుందనుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు రాజ్‌కింగ్‌.

Advertisement
 
Advertisement
Advertisement