బడికి వేళాయెరా | Irrfan Khan's Hindi Medium sequel to go on floors later this year | Sakshi
Sakshi News home page

బడికి వేళాయెరా

Feb 8 2018 1:18 AM | Updated on Feb 8 2018 1:18 AM

Irrfan Khan's Hindi Medium sequel to go on floors later this year - Sakshi

ఇర్ఫాన్‌ ఖాన్

మళ్లీ స్కూల్‌కి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు ఇర్ఫాన్‌ ఖాన్‌. ఆ వయసు దాటిపోయింది కదా అనుకుంటున్నారా? ఇది రీల్‌ స్కూల్‌. గతేడాది ‘హిందీ మీడియమ్‌’ సినిమా కోసం స్కూల్‌కి వెళ్లారు ఇర్ఫాన్‌. ఆ సినిమాలో ఆయన టీచర్‌ కాదు. బిజినెస్‌మేన్‌. కూతురిని ఇంగ్లిష్‌ మీడియమ్‌ స్కూల్‌లో చేర్పించడానికి నానా పాట్లు పడతారు. సాకేత్‌ చౌదరి దర్శకత్వంలో ఇర్ఫాన్‌ ఖాన్, సబా కమర్, దీపక్‌ దోబ్రియాల్‌ ముఖ్య తారలుగా రూపొందిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.

ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్‌ చేశారు. అంటే.. ఇర్ఫాన్‌ ఖాన్‌కు స్కూల్‌కు వెళ్లేందుకు టైమ్‌ అయ్యిందన్న మాట. ఈ సినిమాలోనూ తండ్రి రాజ్‌ బాత్రా పాత్రలోనే ఇర్ఫాన్‌ కనిపించనున్నారని బాలీవుడ్‌ సమాచారం. ఆగస్టులో సెట్స్‌పైకి వెళుతుందట. ఇక హీరోయిన్‌గా సబా కమర్‌నే తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. అంతేకాదు ఈసారి కొంచెం డోస్‌ పెంచి ఇండియన్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీసేందుకు స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నారట చిత్రబృందం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement