వినోదాత్మక ప్రయాణం.. కార్వాన్‌ | Irrfan Khan And Dulquer Salmaan Karwaan Trailer | Sakshi
Sakshi News home page

Jun 27 2018 12:26 PM | Updated on Jun 27 2018 12:38 PM

Irrfan Khan And Dulquer Salmaan Karwaan Trailer - Sakshi

బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌, సౌత్‌ క్రేజీ హీరో దుల్కర్‌ సల్మాన్‌ ల కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా కార్వాన్‌. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ ట్రావెల్‌ డ్రామాతో దుల్కర్‌ బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను ప్రారంభించిన చిత్రయూనిట్ థియేట్రికల్‌ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ట్రైలర్‌ను ఆసక్తికరంగా కట్‌ చేసిన చిత్రయూనిట్ సినిమా థీమ్ ఏంటో రివీల్ చేశారు. తన తండ్రి మరణవార్త విన్న దుల్కర్‌ డెడ్‌ బాడీ కోసం వెళ్లటం.., అక్కడ అనుకోని పరిస్థితుల్లో బాడీ మారిపోయిందని తెలిసుకోని ఇర్ఫాన్‌ తో కలిసి రోడ్‌ట్రిప్‌కు వెళ్లాల్సి రావటం లాంటి అంశాలు సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నాయి. ఇర్ఫాన్‌ ఖాన్‌ డైలాగ్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆకర్ష్‌ ఖురానా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 3న విడుదలకానుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement