ఐరన్‌ మ్యాన్‌ కవచాన్ని దొంగలెత్తుకెళ్లారు.. | Iron Man Suit Stolen From Storage | Sakshi
Sakshi News home page

ఐరన్‌ మ్యాన్‌ కవచాన్ని దొంగలెత్తుకెళ్లారు..

May 10 2018 6:12 PM | Updated on May 10 2018 6:18 PM

Iron Man Suit Stolen From Storage - Sakshi

మార‍్వల్‌ సూపర్‌ హీరో ఐరన్‌ మ్యాన్‌ సూట్‌

లాస్‌ ఏంజిల్స్‌ : సూపర్‌ హీరో ఐరన్‌ మ్యాన్‌ సూట్‌(ఉక్కు కవచం)ను దొంగలెత్తుకెళ్లారు. బుధవారం లాస్‌ ఏంజిల్స్‌లోని ఓ ఆధునాతన గదిలో భద్రంగా దాచిన సూట్‌ను దొంగలెత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనం ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.

ఎరుపు, బంగారు రంగులో ఉన్న ఈ సూట్‌ విలువ దాదాపు రెండు కోట్ల రూపాయల పైమాటేనని పోలీసులు తెలిపారు. 2008లో వచ్చిన ఐరన్‌మ్యాన్‌ సినిమాలో హీరో రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ దీనిని ధరించాడు. ఆ సినిమా అప్పట్లో ఓ చరిత్ర సృష్టించింది. రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టడమే కాకుండా రాబర్ట్‌ డౌనీని అభిమానులకు మరింత చేరువ చేసింది.

రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ వచ్చే ఏడాదిలో అవెంజర్స్‌ సిరీస్‌లోని నాలుగో భాగంలో నటించనున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement