నేను పర్ఫెక్ట్ కాదు! | I'm not perfect : Samantha | Sakshi
Sakshi News home page

నేను పర్ఫెక్ట్ కాదు!

May 8 2016 10:47 PM | Updated on Sep 3 2017 11:41 PM

నేను పర్ఫెక్ట్ కాదు!

నేను పర్ఫెక్ట్ కాదు!

సమంత మంచి నటి. ఆమె చేస్తున్న సినిమాలు చూసినవాళ్లు ఈ మాటతో ఏకీభవిస్తారు. ఈ బ్యూటీ మంచి మనసున్న అమ్మాయి కూడా.

సమంత మంచి నటి. ఆమె చేస్తున్న సినిమాలు చూసినవాళ్లు ఈ మాటతో ఏకీభవిస్తారు. ఈ బ్యూటీ మంచి మనసున్న అమ్మాయి కూడా. అందుకు నిదర్శనంగా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలను చెప్పొచ్చు. ఓవరాల్‌గా సమంత గురించి ఎవరైనాసరే ‘పర్ఫెక్ట్ గాళ్’ అనుకుంటారు. కానీ, సమంత మాత్రం ‘నేను పర్ఫెక్ట్ కాదు’ అంటున్నారు. గత ఎనిమిది నెలలుగా షూటింగ్స్‌తో ఆమె ఫుల్ బిజీ. ఈ సమ్మర్‌లో ఇప్పటికే తమిళ చిత్రం ‘తెరి’, తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ‘24’ చిత్రాలతో తెరపై మెరిశారు. ఇంకా ‘బ్రహ్మోత్సవం’, ‘ఆ..ఆ’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. చేతిలో రెండు, మూడు సినిమాలున్నాయి.

మొత్తానికి వేసవిలోనే నాలుగు సినిమాలు విడుదల ఉండటంతో నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేశారు. ఆ విషయం గురించి సమంత చెబుతూ - ‘‘ఈ ఎనిమిది నెలలు రెస్ట్ లేకుండా షూటింగ్స్ చేశాను. ఒక్కోసారి అలసిపోయేదాన్ని. కానీ, నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల చేయగలిగాను. నా పని ఒత్తిడి వల్ల నేను పర్ఫెక్ట్ కూతురిగా, పర్ఫెక్ట్ ఫ్రెండ్‌గా, పర్ఫెక్ట్ గాళ్ ఫ్రెండ్‌గా ఉండలేకపోయాను. అందుకే కొంచెం ఒత్తిడి తగ్గించుకోవాలనుకుంటున్నాను. ఇంకొన్ని రోజులకు కొత్త సినిమాలేవీ అంగీకరించకూడదని నిర్ణయించుకున్నాను’’ అన్నారు. దీన్నిబట్టి సమంత ఈ మధ్య ఏ స్థాయిలో హార్డ్‌వర్క్ చేశారో ఊహించుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement