చిరంజీవి ఒప్పుకుంటారా? | I will be the item number in my father's 150th movie, says Ram Charan | Sakshi
Sakshi News home page

చిరంజీవి ఒప్పుకుంటారా?

Aug 26 2015 5:44 PM | Updated on Jul 25 2018 3:25 PM

చిరంజీవి ఒప్పుకుంటారా? - Sakshi

చిరంజీవి ఒప్పుకుంటారా?

తన తండ్రి నటించబోయే 150 సినిమాలో స్టెప్పులు వేయాలనుకుంటున్నట్టు చిరంజీవి తనయుడు హీరో రామ్ చరణ్ వెల్లడించాడు.

హైదరాబాద్: తన తండ్రి నటించబోయే 150  సినిమాలో స్టెప్పులు వేయాలనుకుంటున్నట్టు చిరంజీవి తనయుడు హీరో రామ్ చరణ్ వెల్లడించాడు. తన  తండ్రితో కలిసి డాన్స్ చేయాలనుందని చెప్పాడు. 'నాన్న సినిమాలో ఆయనతో కలిసి డాన్స్ చేయాలనుకుంటున్నా. సీన్ లో నటించాలని అనుకోవడం లేదు. స్టెప్పులు వేయాలనివుంద'ని రామ్ చరణ్ తెలిపాడు.

మెగా ఫ్యామిలీ చెందిన మిగతా హీరోలు ఈ సినిమాలో కనిపిస్తారా అని అడగ్గా....  పవన్ కల్యాణ్, నేను అల్లు అర్జున్ సహా అందరం నటిస్తామని సమాధానమిచ్చారు. దీనికి చిరంజీవి ఒప్పుకుంటారా అని ప్రశ్నించగా... ఇది నేను నిర్మిస్తున్న సినిమా. నేను తీసిన సినిమాను మార్కెట్ చేసుకోవడానికి ఇది అవసరం. దీనికి అవసరమైవన్నీ చేస్తాను.  ఆ విషయాలు నాన్న ఎలా చెబుతారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ సినిమాలో కనిపిస్తార'ని జవాబిచ్చారు.

చిరంజీవి కథ ఫైనలైజ్ చేసిన వెంటనే  షూటింగ్ మొదలు పెడతామని చెప్పారు. షూటింగ్ ఆరు నెలల్లో పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవికి సినిమా విడుదల చేయాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయడానికి నలుగురు స్టార్ డైరెక్టర్లు సిద్ధంగా ఉన్నారని చరణ్ వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement