'ఆ సినిమా నుంచి నన్ను తరిమేశారు' | I was thrown out of 'Shuddhi', says Salman Khan | Sakshi
Sakshi News home page

'ఆ సినిమా నుంచి నన్ను తరిమేశారు'

Jun 19 2015 6:40 PM | Updated on Sep 3 2017 4:01 AM

'ఆ సినిమా నుంచి నన్ను తరిమేశారు'

'ఆ సినిమా నుంచి నన్ను తరిమేశారు'

కరణ్ జోహార్ రూపొందిస్తున్న 'శుద్ధి' సినిమా నుంచి తనను తరిమేశారని బాలీవుడ్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ చెబుతున్నాడు.

కరణ్ జోహార్ రూపొందిస్తున్న 'శుద్ధి' సినిమా నుంచి తనను తరిమేశారని బాలీవుడ్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ చెబుతున్నాడు. ఇంతకుముందు ఆ సినిమాలో హృతిక్ రోషన్, కరీనా కపూర్ జంటగా నటిస్తారని చెప్పారు. అయితే తర్వాత హృతిక్ బదులు సల్మాన్ హీరో అన్నారు. కానీ ఇప్పుడు సల్లూభాయ్ బదులు వరుణ్ ధావన్ను తీసుకొచ్చారు. సల్మాన్ ఖాన్ తాను నటించిన 'బజరంగీ భాయీజాన్' సినిమా ట్రైలర్ విడుదల చేసిన తర్వాత శుద్ధి సినిమా గురించి మాట్లాడాడు.

తననైతే సినిమా నుంచి తరిమేశారని, మరి నువ్వు ఆ సినిమాలో ఎందుకు లేవంటూ కరీనా కపూర్ను ప్రశ్నించాడు. హృతిక్ ఉన్నాడు కాబట్టి ఆ సినిమాకు తాను అంగీకరించానని, ఇప్పుడు లేడు కాబట్టి తానూ చేయట్లేదని కరీనా చెప్పింది. అయితే.. తాను హీరోగా వచ్చేసరికే కరీనా ఆ సినిమా నుంచి బయటకు వచ్చేసిన విషయం సల్మాన్కు అప్పుడు తెలిసొచ్చింది. ప్రస్తుతం శుద్ధి సినిమాలో వరుణ్ ధావన్ సరసన ఆలియా భట్ హీరోయిన్గా చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement