నాకు రాష్ట్రపతి అవ్వాలని ఉంది- కత్రినా కైఫ్ | I want to be the president of a country: Katrina Kaif | Sakshi
Sakshi News home page

నాకు రాష్ట్రపతి అవ్వాలని ఉంది- కత్రినా కైఫ్

Feb 8 2016 7:50 PM | Updated on Apr 4 2019 5:42 PM

నాకు రాష్ట్రపతి అవ్వాలని ఉంది- కత్రినా కైఫ్ - Sakshi

నాకు రాష్ట్రపతి అవ్వాలని ఉంది- కత్రినా కైఫ్

అందంతోపాటు అభినయంతో అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్.. తన మనసులో ఉన్న ఓ కోరికను బయటపెట్టి పలువురిని ఆశ్చర్యపరిచింది.

అందంతోపాటు అభినయంతో అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్.. తన మనసులో ఉన్న ఓ కోరికను బయటపెట్టి పలువురిని ఆశ్చర్యపరిచింది. ఫిబ్రవరి 12 న విడుదల కానున్న తన తాజా చిత్రం 'ఫితూర్' ప్రమోషన్లో భాగంగా ఓ టీవీ షోలో పాల్గొన్న కత్రినా సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఫితూర్ అనగా తెలుగులో మానసిక స్థితి, ఒక విధమైన పిచ్చి వంటి అర్థాలు వస్తాయి. అయితే సినిమాలు కాకుండా మీ మనసులో మెదులుతున్న మరో 'ఫితూర్' ఏంటి అని ప్రోగ్రామ్ యాంకర్ ప్రశ్నించగా.. 'నాకు దేశానికి రాష్ట్రపతిని అవ్వాలని ఉంది, అదే ప్రస్తుతానికి నా మనసులో తిరుగుతున్న విషయం' అంటూ ఠకీమని సమాధానం ఇచ్చింది కత్రినా. నేను ఏదైనా సాధించాలని మనసులో అనుకుంటే అది ఎప్పటికైనా తప్పకుండా సాధించి తీరుతాను. చూద్దాం.. ఏమౌతుందో ఎవరికి తెలుసు అంటూ నవ్వేసింది నైఫ్ లాంటి కైఫ్.

అభిషేక్ కపూర్ దర్శకత్వంలో సిద్ధార్థ రాయ్ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం సుప్రసిద్ధ రచయిత చార్లెస్ డికెన్స్ నవల 'గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్' ఆధారంగా తెరకెక్కుతుంది. కత్రినాతోపాటు ఫితూర్ సినిమాలో ఆదిత్య రాయ్ కపూర్, టబు ముఖ్య తారలుగా కనిపించనున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement