తెలుగు హీరోల్లో మహేశ్ బాబు అంటే ఇష్టం: దీపిక | I like Mahesh babu among Telugu Heroes: Deepika Padukone | Sakshi
Sakshi News home page

తెలుగు హీరోల్లో మహేశ్ బాబు అంటే ఇష్టం: దీపిక

Sep 3 2014 12:50 PM | Updated on Sep 2 2017 12:49 PM

తెలుగు హీరోల్లో మహేశ్ బాబు అంటే ఇష్టం: దీపిక

తెలుగు హీరోల్లో మహేశ్ బాబు అంటే ఇష్టం: దీపిక

తెలుగులో నటించాలని ఎదురు చూసినపుడు అవకాశాలు రాలేదు. అవకాశం వచ్చిన సమయం చిక్కలేదు అని బాలీవుడ్ తార దీపికా పదుకోనే అన్నారు.

తెలుగులో నటించాలని ఎదురు చూసినపుడు అవకాశాలు రాలేదు. అవకాశం వచ్చిన సమయం చిక్కలేదు అని బాలీవుడ్ తార దీపికా పదుకోనే అన్నారు. హిందీ చిత్రం 'ఫైండింగ్ ఫెనీ' చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీపికా మాట్లాడుతూ 'తెలుగులో తనకు ఇష్టమైన హీరో మహేశ్ బాబు' ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మహేశ్ అంటే తనకు కూడా ఇష్టమని హీరో అర్జున్ కపూర్ తెలిపారు. 
 
కళాకారులకు భాషతో సంబంధమేమి లేదని...మంచి అవకాశం వస్తే ఏ భాషలోనైనా నటిస్తానని దీపికా తెలిపారు. హోమీ అదాజానియా దర్వకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ కపూర్ సరసన దీపికా పదుకోనే నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12 తేదిన విడుదల కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement