breaking news
Homi Adajania
-
అవకాశాలు వెల్లువెత్తొచ్చు..!
న్యూఢిల్లీ: భవిష్యత్తులో మంచి మంచి ప్రాజెక్టులు తనకు వచ్చేందుకు మార్గం సుగమమైనట్టేనని ‘ఫైండింగ్ ఫ్యానీ’ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన నటి అంజలి పాటిల్ భావిస్తోంది. తనను కొత్త కోణంలో ప్రేక్షకులు చూసే అవకాశం ఈ సినిమాతో లభించిందంది. కొత్త అవకాశాలకు ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నానంటూ కొన్ని కలల సంఘటనలతోపాటు సినిమా చివరిలో కనిపించిన ఈ 27 ఏళ్ల వర్ధమాన తార తన మనసులో మాట బయటపెట్టింది. ‘ఈ సినిమాలో నేను గ్లామరస్ పాత్రలో కనిపించా. గతంలో ఇటువంటి పాత్ర దొరకనే లేదు. ‘ఫైండింగ్ ఫ్యానీ’లో సినిమాలో నటించిన కారణంగా మున్ముందు నాకు గ్లామరస్ పాత్రలు దొరికే అవకాశముంది’ అని అంది. హోమి అడజానియా తీసేసినిమాల్లో అతిథి పాత్ర దొరికినా చేసేందుకు తనకు ఎటువంటి అభ్యంతరమూ లేదంది. పైగా సంతోషిస్తానంది. ‘ఫైండింగ్ ఫ్యానీ’ సినిమాలో చిన్న పాత్ర అయినా అభ్యంతరం చెప్పేందుకు తనకు ఎటువంటి కారణమూ దొరకలేదంది. ‘ ఈ సినిమా ఎంతో బాగుంది. ఈ సినిమాలో అవకాశం కోసం నన్ను అప్పట్లో సంప్రదించడం ఇప్పుడు ఎంతో సంతోషం కలిగిస్తోంది. హోమి.. ఓ అద్భుతమైన దర్శకుడు. ఇక ఫైండింగ్ ఫ్యానీ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఈ సినిమాలో నటించాలంటూ నన్ను అప్పట్లో సంప్రదించాడు. ఆ తర్వాత నజీరుద్దీన్ షాతో కలసి షూటింగ్లో పాల్గొన్నా’ అని అంది. కాగా ‘ఢిల్లీ ఇన్ ఏ డే’ అనే అంతర్జాతీయ ప్రాజెక్టుతో అంజలి ... సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో అంజలి నటనకు విమర్శకులు సైతం మంచి మార్కులు వేశారు. ‘నా బంగారు తల్లి’ అనే తెలుగు సినిమాలో నటించిన అంజలికి జాతీయ పురస్కారం దక్కింది. -
'ఫైండింగ్ ఫెనీ' చిత్రం ప్రమోషన్లో దీపికా
-
తెలుగు హీరోల్లో మహేశ్ బాబు అంటే ఇష్టం: దీపిక
తెలుగులో నటించాలని ఎదురు చూసినపుడు అవకాశాలు రాలేదు. అవకాశం వచ్చిన సమయం చిక్కలేదు అని బాలీవుడ్ తార దీపికా పదుకోనే అన్నారు. హిందీ చిత్రం 'ఫైండింగ్ ఫెనీ' చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీపికా మాట్లాడుతూ 'తెలుగులో తనకు ఇష్టమైన హీరో మహేశ్ బాబు' ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మహేశ్ అంటే తనకు కూడా ఇష్టమని హీరో అర్జున్ కపూర్ తెలిపారు. కళాకారులకు భాషతో సంబంధమేమి లేదని...మంచి అవకాశం వస్తే ఏ భాషలోనైనా నటిస్తానని దీపికా తెలిపారు. హోమీ అదాజానియా దర్వకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ కపూర్ సరసన దీపికా పదుకోనే నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12 తేదిన విడుదల కానుంది.