నేను సృష్టించిన అద్భుతం : జెనీలియా | I created a miracle: Genelia on son Rahyls birthday | Sakshi
Sakshi News home page

నేను సృష్టించిన అద్భుతం : జెనీలియా

Jun 1 2017 2:58 PM | Updated on Sep 5 2017 12:34 PM

నేను సృష్టించిన అద్భుతం : జెనీలియా

నేను సృష్టించిన అద్భుతం : జెనీలియా

తన చిన్న కొడుకు రహైల్ పుట్టిన రోజు సందర్భంగా తను నేను సృష్టించిన అద్భుతం అంటూ ట్వీత్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో రహైల్ తో కలిసి

హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న జెనీలియా తన కొడుకు పుట్టిన రోజు సందర్భంగా ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. తన చిన్న కొడుకు రహైల్ పుట్టిన రోజు సందర్భంగా తను నేను సృష్టించిన అద్భుతం అంటూ ట్వీత్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో రహైల్ తో కలిసి దిగిన ఫోటోతో పాటు ఈ కామెంట్ ను పోస్ట్ చేసింది. రహైల్ తండ్రి, బాలీవుడ్ హీరో రితేష్ కూడా కొడుకు బర్త్ డేను సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేశాడు, పుట్టిన రోజు వేడుకకు తను కేక్ రెడీ చేస్తున్న వీడియోనే ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు రితేష్.

' ఈ రోజు ప్రత్యేకమైన రోజు.. రహైల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ కామెంట్ చేశాడు. హ..హ.. హాసినిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన జెనీలియా ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ ను పెళ్లాడిన తరువాత వెండితెరకు దూరమైన ఈ బ్యూటి రెండో కొడుకుకు జన్మనిచ్చిన తరువాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే జెనీలియాకు రీ ఎంట్రీలో ఆశించిన స్థాయిలో హైప్ రాలేదు.

 

Advertisement
 
Advertisement
Advertisement