'నిజంగా వారికి నమస్కరించాల్సిందే' | I bow down to short filmmakers' passion: Allu Arjun | Sakshi
Sakshi News home page

'నిజంగా వారికి నమస్కరించాల్సిందే'

Aug 17 2014 1:41 PM | Updated on Sep 2 2017 12:01 PM

'నిజంగా వారికి నమస్కరించాల్సిందే'

'నిజంగా వారికి నమస్కరించాల్సిందే'

తాను దర్శకుడు సుకుమార్ సామాజిక అవగాహన నేపథ్యంగా 'ఐయామ్ దట్ చేంజ్' షార్ట్ ఫిలిం రూపొందించామని స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ వెల్లడించారు.

చెన్నై: తాను దర్శకుడు సుకుమార్ సామాజిక అవగాహన నేపథ్యంగా 'ఐయామ్ దట్ చేంజ్' షార్ట్ ఫిలిం రూపొందించామని స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ వెల్లడించారు. ఆదివారం చెన్నైలో ఆ షార్ట్ ఫిలిం  నిర్మణంపై ఆయన మాట్లాడుతూ... విజయవంతమైన కథానాయకుడిగా, నిర్మాత కొడుకుగా, నిర్మాణ సంస్థకు చెందిన తనకే షార్ట్ ఫిలిం తెరకెక్కించడానికి ఎంతో కష్టాలు పడాల్సి వచ్చిందని తెలిపారు. నా సంగతే ఇలా ఉంటే షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్న వారి సంగతి చూస్తే ఎలా ఉంటుందో అని ఆయన అన్నారు.

షార్ట్ ఫిలిమ్స్ తీయడం అంత తేలికైన విషయం కాదని 'ఐయామ్ దట్ చేంజ్' ద్వారా అర్థమైందని తెలిపారు. షార్ట్ ఫిలిం తీయడమే హాబీగా ఎంచుకుని ఆ రంగంలో ఉన్న వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అల్లు అర్జున్ చెప్పారు. దేశభక్తి నేపథ్యంలో తాను నటించిన ఐయామ్ దట్ ఛేంజీ షార్ట్ ఫిలింలో నటించడం ఓ చాలెంజ్గా తీసుకున్నానని విశదీకరించారు. షార్ట్ ఫిలిం ఐయామ్ దట్ ఛేంజీకి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన తనను ఉక్కిరిబిక్కిరి చేసిందన్నారు. మరీ ముఖ్యంగా అన్లైన్లో మంచి స్పందన వచ్చిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement