'నాకు మల్టీ స్టారర్ చిత్రాల వల్ల ఇబ్బంది లేదు' | I am very secure as an artiste, Abhishek Bachchan | Sakshi
Sakshi News home page

'నాకు మల్టీ స్టారర్ చిత్రాల వల్ల ఇబ్బంది లేదు'

Oct 21 2014 3:04 PM | Updated on Apr 3 2019 6:23 PM

'నాకు మల్టీ స్టారర్ చిత్రాల వల్ల ఇబ్బంది లేదు' - Sakshi

'నాకు మల్టీ స్టారర్ చిత్రాల వల్ల ఇబ్బంది లేదు'

బాలీవుడ్ లో తాను నటించే మల్టీ స్టారర్ సినిమాలతో పెద్దగా ఇబ్బందేమీ లేదంటున్నాడు ప్రముఖ నటుడు అభిషేక బచ్చన్.

న్యూఢిల్లీ:బాలీవుడ్ లో తాను నటించే మల్టీ స్టారర్ సినిమాలతో పెద్దగా ఇబ్బందేమీ లేదంటున్నాడు ప్రముఖ నటుడు అభిషేక బచ్చన్.  'ధూమ్-3'లో అమీర్ ఖాన్ తో కలిసి మల్టీ స్టారర్ చిత్రంలో చివరిసారిగా నటించిన ఆ హీరో.. తాను నటుడిగా సురక్షిత స్థానంలో ఉన్నట్లు తెలిపాడు. 'నేను సినిమాలు ఎంపిక చేసుకునేటప్పుడు పాత్రకే ప్రాధాన్యత ఇస్తా. అది సోలోనా, మల్టీ స్టారర్ సినిమానా అనే విషయానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వను.  ప్రస్తుతం నాకు నటుడిగా ఎటువంటి ఇబ్బంది లేదు'అని తెలిపాడు.

 

సోలో చిత్రాలు ఏ ఒక్కరి క్రెడిట్ తోనూ విజయవంతం కావని స్పష్టం చేశాడు. అసలు సినిమా అనేది టీమ్ ఎఫర్ట్. అది ఏమీ ఒక నటుని ఘనత కాదంటూ తన హుందతనాన్ని చాటుకున్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'హ్యాపీ న్యూ ఇయర్'చిత్రంలో అభిషేక్ పాత్రకు సంబంధించి పై విధంగా స్పందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement