తగని ప్రశ్న తగిన జవాబు | I am not a feminist, I believe in equality: Trisha | Sakshi
Sakshi News home page

తగని ప్రశ్న తగిన జవాబు

Jul 25 2018 12:36 AM | Updated on Jul 25 2018 12:36 AM

 I am not a feminist, I believe in equality: Trisha - Sakshi

‘నేను ఫెమినిస్టును కాదు’ అంటున్నారు. కానీ స్త్రీ, పురుష సమానత్వం ఉండాలంటున్నారు! ఫెమినిజం, సమానత్వం రెండూ ఒకటే కదా!

త్రిష : ఎస్‌! నేను ఫెమినిస్టును కాదు. ఫెమినిజం అనే భావన విస్తృతమైనది. ‘సమానత్వం’ అనే అర్థంతో ఫెమినిజం అనే మాటను సరిపెట్టేయలేం. ఫెమినిస్టులు ఒక్క సమానత్వం గురించే మాట్లాడరు. వాళ్లు చాలా చేస్తారు. అసమానత్వాన్ని ప్రశ్నిస్తారు. బయటికి వచ్చి పోరాడతారు. స్త్రీల సమస్యలపై, స్త్రీల సంక్షేమంపై, స్త్రీల భద్రతపై సామాజిక, రాజకీయ, సృజనాత్మక వేదికలపై ప్రసంగిస్తారు.

ఉద్యమాలు చేస్తారు. మగవాళ్లలో స్త్రీల సమస్యలపై సహానుభూతిని కలిగిస్తారు. నేను ఇవన్నీ చేయడం లేదు. కాబట్టి ఫెమినిస్టును కాదు. స్త్రీ, పురుష సమానత్వం ఆశిస్తున్న ఒక సాధారణ మహిళను. అంతే. త్రిష నటించిన హారర్‌ థ్రిల్లర్‌ ‘మోహిని’ ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఆ చిత్రం ప్రోమో కోసం ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో త్రిష వెలిబుచ్చిన అభిప్రాయాలివి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement