'నేను చాలా సెన్సిటివ్.. నాకు ఆ ఉద్దేశం లేదు' | I am a sensitive person, often get angry: sunnt deol | Sakshi
Sakshi News home page

'నేను చాలా సెన్సిటివ్.. నాకు ఆ ఉద్దేశం లేదు'

Dec 12 2015 8:12 PM | Updated on Apr 3 2019 6:23 PM

'నేను చాలా సెన్సిటివ్.. నాకు ఆ ఉద్దేశం లేదు' - Sakshi

'నేను చాలా సెన్సిటివ్.. నాకు ఆ ఉద్దేశం లేదు'

తాను చాలా సున్నితమైన వాడినని ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నిడియోల్ అన్నారు. ఎప్పుడోగానీ తనకు కోపం రాదని, సాధారణంగా చాలా కూల్ గా ఉంటానని తెలిపారు.

ముంబయి: తాను చాలా సున్నితమైన వాడినని ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నిడియోల్ అన్నారు. ఎప్పుడోగానీ తనకు కోపం రాదని, సాధారణంగా చాలా కూల్ గా ఉంటానని తెలిపారు. 'గాయల్ వన్స్ ఎగైన్' అనే చిత్రంతో మరోసారి సన్నీ డియోల్ తన అభిమానుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్ ఈ నెల 17న విడుదలకానుంది.

ఈ నేపథ్యంలో తొలిసారి తన స్వంత అనుభవాలను మీడియాతో పంచుకున్న డియోల్ తనను తాను ఓ రకంగా మిస్టర్ కూల్ అని చెప్పుకున్నారు. ఎప్పుడూ సీరియస్ గా యాక్షన్ చిత్రాల్లోనే నటించినా కోపం తనకు అంత తేలికగా రాదని అన్నారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం మాత్రం లేదని స్పష్టం చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement