breaking news
Ghayal Once Again
-
'నేను చాలా సెన్సిటివ్.. నాకు ఆ ఉద్దేశం లేదు'
ముంబయి: తాను చాలా సున్నితమైన వాడినని ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నిడియోల్ అన్నారు. ఎప్పుడోగానీ తనకు కోపం రాదని, సాధారణంగా చాలా కూల్ గా ఉంటానని తెలిపారు. 'గాయల్ వన్స్ ఎగైన్' అనే చిత్రంతో మరోసారి సన్నీ డియోల్ తన అభిమానుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్ ఈ నెల 17న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో తొలిసారి తన స్వంత అనుభవాలను మీడియాతో పంచుకున్న డియోల్ తనను తాను ఓ రకంగా మిస్టర్ కూల్ అని చెప్పుకున్నారు. ఎప్పుడూ సీరియస్ గా యాక్షన్ చిత్రాల్లోనే నటించినా కోపం తనకు అంత తేలికగా రాదని అన్నారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం మాత్రం లేదని స్పష్టం చేశారు. -
మితంగానా? సన్నీహితంగానా?
ఒకనాటి సూపర్‌హిట్ ఘాయల్కి సీక్వెల్ తీస్తున్నాడు సన్నీ డియోల్. ఘాయల్ వన్స్ అగైన్ పేరుతో రూపొందిస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాలో సన్నీడియోల్తో సైఫ్ సోదరి, రంగ్ దే బసంతిలో సిద్ధార్ధతో జోడీ కట్టిన సోహా అలీఖాన్ నటిస్తోంది. ఇందులో సైకియాట్రిస్ట్ పాత్ర పోషిస్తున్న సోహాకి, సన్నీడియోల్‌కి మధ్య కధలో సందర్భానుసారం వచ్చే కొన్ని శృంగార సన్నివేశాలు ఉన్నాయట. ఇంకా చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉన్న ఆ హాట్ సీన్ల గురించి 36 ఏళ్ల సోహా అలీఖాన్ ఇప్పటి నుంచి నెర్వస్‌గా ఫీలవుతోందట. సన్నీడియోల్ వంటి సీనియర్ నటుడితో నటించడం అనేది ఓ వైపు ఆనందంగానే అనిపిస్తున్నా... అదే సమయంలో సదరు సన్నివేశాల్లో ఎలా నటిస్తానో అనే ఆందోళన తనకు ఉందని సన్నిహితుల వద్ద ఓపెన్ అవుతోందట సోహా. మరో విషయమేమిటంటే... సోహా భర్త కునాల్ ఖేము కూడా నటుడే. నాటి హీరో ధర్మేంద్ర దర్శకత్వంలో రూపొందుతూ, నవంబరులో విడుదల కానున్న ‘ఘాయల్ వన్స్‌మోర్’ ప్రేక్షకుల ముందుకు వస్తే కానీ... సోహా అలీఖాన్ నెర్వస్‌నెస్‌ను తగ్గించుకోగలిగిందా లేదా అనేది మనకి తెలియదు.