మరోసారి హైదరాబాద్‌ నవాబులు | 'Hyderabad Nawabs 2' Trailer Launch | Sakshi
Sakshi News home page

మరోసారి హైదరాబాద్‌ నవాబులు

Jan 27 2019 2:07 AM | Updated on Jan 27 2019 2:07 AM

'Hyderabad Nawabs 2' Trailer Launch - Sakshi

అలీ, సూఫీఖాన్‌

రామకృష్ణ (ఆర్కే) స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం ‘హైదరాబాద్‌ నవాబ్స్‌ 2’. పదేళ్ల క్రితం వచ్చిన ‘హైదరాబాద్‌ నవాబ్స్‌’ చిత్రానికి సీక్వెల్‌ ఇది. రామకృష్ణ, అజీజ్‌ నాజన్, కెబి జానీ, సాజిద్‌ ఖాన్, అలీ రాజా, సూఫీ ఖాన్, ఫరా కీలక పాత్రలు చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘2006లో వచ్చిన మా ‘హైదరాబాద్‌ నవాబ్స్‌’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడీ సీక్వెల్‌ కూడా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. వినోదానికి పెద్ద పీట వేశాం’’ అని రామకృష్ణ అన్నారు. ‘‘పూర్తి హాస్యభరితంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది’’ అని అలీ, అజీజ్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement