రావమ్మా హ్యూమా | Huma Qureshi To Star In Zack Snyder's Army Of The Dead | Sakshi
Sakshi News home page

రావమ్మా హ్యూమా

Jun 2 2019 5:21 AM | Updated on Jun 2 2019 5:24 AM

Huma Qureshi To Star In Zack Snyder's Army Of The Dead - Sakshi

హ్యూమా ఖురేషీ

బాలీవుడ్‌ హీరోయిన్‌ హ్యూమా ఖురేషీకి ఇంటర్నేషనల్‌ కాల్స్‌ వస్తున్నాయి. ‘హ్యూమా.. రామ్మా’ అంటూ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్స్‌ ఆమెను ఆహ్వానిస్తున్నారు. రెండేళ్ల క్రితం ‘వైస్రాయ్‌ హౌస్‌’ అనే ఇంగ్లీష్‌ చిత్రంలో నటించిన హ్యూమా తాజాగా ‘ఆర్మీ ఆఫ్‌ డెడ్‌’ అనే మరో ఇంగ్లీష్‌ ప్రాజెక్ట్‌లో ముఖ్య తారగా చేసే  చాన్స్‌ కొట్టేశారు. డ్వాన్‌ ఆఫ్‌ ద డెడ్‌ (2004), 300 (2006), 300: రైజ్‌ ఆన్‌ఎంపైర్‌ (2014) వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన జాక్‌ స్నైడర్‌ ఈ చిత్రానికి దర్శకుడు.

2007లో తెరకెక్కించిన ‘జస్టిస్‌ లీగ్‌’ తర్వాత జాక్‌ మళ్లీ మెగాఫోన్‌ పట్టడం ఇదే. ఇంగ్లీష్‌ నటులు ఎలా పర్నెల్, అనా దే లా రెగెరా, థియో రోసి ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. ‘‘దర్శకుడు జాక్‌గారికి నేను పెద్ద అభిమానిని. ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. షూటింగ్‌ ఎప్పుడు స్టార్ట్‌ చేస్తారా? అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు హ్యూమా ఖురేషి. ఇక డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లో హ్యూమా నటించిన ‘లీలా’ అనే వెబ్‌సీరిస్‌ ఈ నెలలో విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement