టికెట్ల కోసం రికమండేషన్ లెటర్ | Huge Demand For Kabali Tickets | Sakshi
Sakshi News home page

టికెట్ల కోసం రికమండేషన్ లెటర్

Jul 21 2016 2:17 PM | Updated on Sep 4 2017 5:41 AM

టికెట్ల కోసం రికమండేషన్ లెటర్

టికెట్ల కోసం రికమండేషన్ లెటర్

కబాలి ఫీవర్ చెన్నై రాజకీయాలను సైతం తాకింది. ఇప్పటికే కబాలి టికెట్ల కోసం భారీ పోటి నెలకొన్న దృష్ట్యా సీన్లోకి పొలిటికల్ లీడర్లు కూడా ఎంటర్ అయ్యారు. తొలి రోజు సినిమా టికెట్ల కోసం...

కబాలి ఫీవర్ చెన్నై రాజకీయాలను సైతం తాకింది. ఇప్పటికే కబాలి టికెట్ల కోసం భారీ పోటి నెలకొన్న దృష్ట్యా సీన్లోకి పొలిటికల్ లీడర్లు కూడా ఎంటర్ అయ్యారు. తొలి రోజు సినిమా టికెట్ల కోసం రాష్ట్ర మంత్రుల ఆఫీసుల నుంచి రికమండేషన్ లెటర్ వస్తుండటంతో థియేటర్ల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నారు.

తాజాగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇన్ఫర్మేషన్, పబ్లిసిటీ మంత్రి.., సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పేరిట.. అభిరామి థియేటర్ మేనేజర్కు లెటర్ వచ్చింది. కబాలి సినిమా పది టికెట్లను తిరు, రిజ్వాన్లకు ఇవ్వాలంటూ ఈ లెటర్లో సూచించారు. అడ్వాన్స్ బుకింగ్లతో పాటు ఫ్యాన్స్ ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న థియేటర్ యాజమాన్యాలకు రాజకీయనాయకుల రికమండేషన్ లు మరింత సమస్యగా మారాయి.

Advertisement
 
Advertisement
Advertisement