ఆకట్టుకుంటోన్న ‘సూపర్‌ 30’ ట్రైలర్‌ | Hrithik Roshan Super 30 Trailer Released | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటోన్న ‘సూపర్‌ 30’ ట్రైలర్‌

Jun 4 2019 5:01 PM | Updated on Jun 4 2019 5:07 PM

Hrithik Roshan Super 30 Trailer Released - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌ కుమార్‌ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ‘సూపర్‌ 30’ షూటింగ్‌ను పూర్తి  చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రానికి విడుదల తేదీని ఫిక్స్‌ చేశారు మేకర్స్‌. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు.

ఈ ట్రైలర్‌ మొత్తంలో హృతిక్‌ రోషన్‌ సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఆనంద్‌ కుమార్‌ పాత్రలో జీవించేశాడు. హృతిక్‌ రోషన్‌ అంటే ప్రేక్షకులు ఎలా ఊహించుకుంటారో దానికి భిన్నంగా(డీగ్లామర్‌ క్యారెక్టర్‌లో) ఈ ట్రైలర్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల అయినప్పటి నుంచి ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌తో భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. వికాస్‌ భల్‌ దర్శకత్వంలో సాజిద్‌ నడియాద్‌వాలాకు చెందిన నడియాద్‌వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫాంటమ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈచిత్రం జూలై 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement