రెండోసారి... | Hrithik Roshan Satte Pe Satta Remake | Sakshi
Sakshi News home page

రెండోసారి...

Jun 8 2019 2:44 AM | Updated on Jun 8 2019 2:44 AM

Hrithik Roshan Satte Pe Satta Remake - Sakshi

హృతిక్‌ రోషన్‌ కెరీర్‌లో పెద్ద హిట్స్‌లో ఒకటైన ‘అగ్నిపథ్‌’ చిత్రం అదే పేరుతో చేసిన అమితాబ్‌ బచ్చన్‌ చిత్రానికి రీమేక్‌ అనే సంగతి తెలిసిందే. తాజాగా మరో అమితాబ్‌ సినిమా రీమేక్‌లో హృతిక్‌ నటించబోతున్నాడని బాలీవుడ్‌ సమాచారం. అమితాబ్‌ హీరోగా 1982లో వచ్చిన ‘సట్టే పే సట్టా’ చిత్రాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా ఫరాఖాన్‌ రీమేక్‌ చేసేందుకు స్క్రిప్ట్‌ రెడీ చేసుకున్నారట. ఈ సినిమాలో నటించడానికి హృతిక్‌ అంగీకారాన్ని తెలిపారని తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ ఫైనల్‌ స్టేజ్‌లో ఉందట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రానుంది. రోహిత్‌శెట్టితో కలసి ఫరాఖాన్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement