సూపర్‌ 30 ఫస్ట్‌లుక్‌ లాంచ్ | Hrithik Roshan Looks Intense As Mathematician Anand Kumar | Sakshi
Sakshi News home page

సూపర్‌ 30 ఫస్ట్‌లుక్‌ లాంచ్

Sep 5 2018 10:23 AM | Updated on Sep 5 2018 10:53 AM

Hrithik Roshan Looks Intense As Mathematician Anand Kumar - Sakshi

సూపర్‌ 30లో హృతిక్‌ కనిపిస్తారిలా..

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌ కుమార్‌ బయోపిక్‌గా తెరకెక్కుతున్న సూపర్‌ 30 సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. టీచర్స్‌ డే సందర్భంగా బుధవారం తన ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను హృతిక్‌ రోషన్‌ షేర్‌ చేశారు. ఈ పోస్టర్‌లో హృతిక్‌ గుబురుగడ్డంతో సీరియస్‌ లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. మ్యాథమేటిక్‌ ఫార్ములాతో పోస్టర్‌ను డిజైన్‌ చేసినట్టు కనిపిస్తుండగా పోస్టర్‌ కింద ‘అబ్‌ రాజా కా బేటా రాజా నహీ బనేగా’ అనే క్యాప్షన్‌ సినిమాపై ఆసక్తి రేపుతోంది.

బిగ్‌ స్క్రీన్‌పై హృతిక్‌ తొలిసారిగా రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌ను పోషిస్తుండటంతో మూవీపై అంచనాలు రెట్టింపయ్యాయి. వికాస్‌ భల్‌ దర్శకత్వంలో సాజిద్‌ నడియాద్‌వాలాకు చెందిన నడియాద్‌వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫాంటమ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సూపర్‌ 30 వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా ‍ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇంకా ఈ మూవీలో మృణాల్‌ ఠాకూర్‌, టీవీ నటుడు నందిష్‌ సింగ్‌ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ కంగనా రనౌత్‌ మణికర్ణిక, ఇమ్రాన్‌ హష్మిల ఛీట్‌ ఇండియాలతో తలపడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement