నా మనవళ్లు నటులు కావాలనుకుంటున్నారు! | Hrehaan, Hridhaan want to become actors: Rakesh Roshan | Sakshi
Sakshi News home page

నా మనవళ్లు నటులు కావాలనుకుంటున్నారు!

Sep 20 2014 4:29 PM | Updated on Apr 3 2019 6:23 PM

నా మనవళ్లు నటులు కావాలనుకుంటున్నారు! - Sakshi

నా మనవళ్లు నటులు కావాలనుకుంటున్నారు!

అలనాటి నటుడు, దర్శకుడు, నిర్మాత రాకేశ్ రోషన్ తనదైన ముద్రతో ప్రేక్షకుల్ని మెప్పించిన సంగతి తెలిసిందే.

న్యూఢిల్లీ: ఆనాటి నటుడు, దర్శకుడు, నిర్మాత రాకేశ్ రోషన్ తనదైన ముద్రతో ప్రేక్షకుల్ని మెప్పించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ప్రముఖ స్థానం సంపాదించిన వ్యక్తుల్లో రాకేష్ రోషన్ కూడా ఒకరు.  ప్రస్తుతం బాలీవుడ్ లో ఆయన కుమారుడు హృతిక్ రోషన్ విశేషంగా రాణిస్తున్నారు. ఇప్పుడు రాకేష్ రోషన్ మనవళ్లు కూడా బాలీవుడ్ రంగం ప్రవేశం చేయాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని రాకేష్ రోషన్ స్వయంగా వెల్లడించారు. 'నా మనవళ్లు హ్రీహాన్, హ్రీద్దాన్ లు నటులు కావాలనుకుంటున్నారు. వారి తండ్రి హృతిక్ నడిచిన బాటలోనే వెళ్లాలనుకుంటున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. రోషన్ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన ఆస్తిని వారు అందిపుచ్చుకోవాలనుకుంటున్నారు' అని రాకేష్  స్పష్టం చేశారు.

 

అంతకుముందుగానే ఈ విషయంలో వారి అభిప్రాయం తెలుసుకున్నట్ల ఆయన తెలిపారు. గతంలో హృతిక్ సినిమాల్లో రావాలనుకుంటున్న సమయంలోతనతో పాటు సినిమా సెట్ లో వచ్చే వాడని ఒక ప్రశ్నకు సమాధానంగా  చెప్పారు. ఇప్పుడు తన మరో కుమారుడు రాజేష్ కుమారుడు కూడా తన వద్దనే శిక్షణ తీసుకుంటున్నాడని రాకేష్ రోషన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement