‘హాలిడేలో’ అన్నీ రియల్ ఫైట్లే | 'Holiday' not really a remake, says Akshay Kumar | Sakshi
Sakshi News home page

‘హాలిడేలో’ అన్నీ రియల్ ఫైట్లే

May 30 2014 10:29 PM | Updated on Oct 2 2018 3:08 PM

‘హాలిడేలో’ అన్నీ రియల్ ఫైట్లే - Sakshi

‘హాలిడేలో’ అన్నీ రియల్ ఫైట్లే

త్వరలో విడుదల కానున్న హాలిడే సినిమా షూటింగ్‌లో భాగంగా బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ఓ భవంతిపై నుంచి కిందికి దూకాడు.

అక్షయ్‌కుమార్
న్యూఢిల్లీ: త్వరలో విడుదల కానున్న హాలిడే సినిమా షూటిం గ్‌లో భాగంగా బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ఓ భవంతిపై నుంచి కిందికి దూకాడు. అంతేకాకుండా ఓ భీకరమైన పోరాటం కూడా చేశాడు. ఈ సందర్భంగా అక్షయ్ మీడియా తో మాట్లాడుతూ తన మనోభావాలను పంచుకున్నాడు. ‘సైనికుడెప్పుడూ సెలవు తీసుకోడు. అయితే చిన్నదైనా, పెద్దదైనా సినిమా షూటింగ్‌లో భాగంగా స్టంట్  చేసే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అది ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.

రిస్కీ సీన్లు చేసే సమయంలో ఎంతో ఔచి త్యంతో వ్యవహరించాలి. చివరికి చిన్న జంప్‌లు చేసేటపుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. పెద్ద స్టంట్లు మాత్రమే ప్రమాదమనుకోకూడదు. ఒక్కోసారి చిన్న స్టంట్‌కూడా ప్రాణాలపైకి రావొ చ్చు’ అని అన్నాడు. హాలిడే సినిమాలో భారీ స్టంట్‌లు చేస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా పై విధంగా స్పందించాడు. ఎ.ఆర్.మురగదాస్ సారథ్యంలో రూపొందుతున్న హాలి డే సినిమా కోసం నిర్మాతలు బ్రిటన్‌నుంచి  ప్రముఖ స్టంట్‌మెన్ గ్రెగ్ పొవెల్‌ను ఇండియాకు రప్పించారు.

 హారీ పొట్టర్, జేమ్స్ బాండ్ తదితర సినిమాలకు గ్రెగ్ పొవెల్ స్టంట్‌మెన్‌గా చేశాడు. ఈ నేపథ్యంలో హాలిడే సినిమా కోసం అతనిని ఇండియాకు నిర్మాతలు రప్పించారు. ఈ విషయమై అక్షయ్ మాట్లాడుతూ యాక్షన్ సీక్వెన్సెస్ ప్రేక్షకులను కచ్చితంగా అబ్బురపరుస్తాయన్నాడు.

‘నా దర్శకుడు రియాలిటీనే కోరుకుంటాడు. అందువల్ల ఫైట్ సీన్లను తిలకించే సమయంలో ప్రేక్షకులంతా అబ్బురపోవడం తథ్యం’ అని అన్నాడు. ఈ సినిమాలో అన్నీ రియల్ ఫైట్లేనన్నాడు. ఈ సినిమాలో అకీరు స్టంట్ అనే యుద్ధ విద్య కూడా చేశాన ని ఈ 46 ఏళ్ల నటుడు చెప్పాడు. సినిమా షూటింగ్ మొత్తం ముంబైలోనే జరిగిందన్నాడు. స్టూడియోలలో తీయలేదన్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement