వరుణ్‌ తేజ్‌తో పాటు ‘వాల్మీకి’ టీంకు నోటీసులు | High Court Issues Notice to Valmiki Movie Team and Varun Tej | Sakshi
Sakshi News home page

వరుణ్‌ తేజ్‌తో పాటు ‘వాల్మీకి’ టీంకు నోటీసులు

Sep 13 2019 2:14 PM | Updated on Sep 13 2019 2:16 PM

High Court Issues Notice to Valmiki Movie Team and Varun Tej - Sakshi

మెగా హీరో వరుణ్ తేజ్‌ నటించిన వాల్మీకి సినిమాను సమస్యలు వెంటాడుతున్నాయి. ఈసినిమా టైటిల్‌ ప్రకటించిన దగ్గర నుంచి టైటిల్‌ మార్చాలంటూ బోయ కులస్తులు ఆందోళనలు చేస్తున్నారు. సినిమా టైటిల్‌ తమను కించపరిచే విధంగా ఉందంటూ వారు ఆరోపిస్తున్నారు. ఇటీవల వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం డీజీపీ, సెన్సార్‌ బోర్డు, ఫిలిం ఛాంబర్‌లతో పాటు హీరో వరుణ్‌ తేజ్‌కు, చిత్రయూనిట్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. తమిళ సినిమా జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కిన వాల్మీకి సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను ప్రతినాయక ఛాయలున్న పాత్రలో వరుణ్ తేజ్‌ నటిస్తుండగా తమిళ నటుడు అధర్వ హీరోగా నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement