న్యూస్ ‌పేప‌ర్‌ను చుట్టుకున్న హీరోయిన్‌! | Heroine Payal Rajput News paper Stills Reminds Iconic Flim | Sakshi
Sakshi News home page

పాయ‌ల్ డ్రెస్సింగ్‌పై ట్రోల్స్ ..

Apr 23 2020 1:30 PM | Updated on Apr 23 2020 2:12 PM

Heroine Payal Rajput  News paper Stills Reminds Iconic Flim - Sakshi

లాక్‌డౌన్ పుణ్య‌మా అని చాలామంది త‌మ క్రియేటివిటికి ప‌నిచెబుతున్నారు. సామాన్యులే కాదు సెల‌బ్రెటీలు కూడా  ర‌కార‌కాల ఆలోచ‌న‌ల‌తో ముందుకు వ‌స్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్ కూడా త‌న క్రియేటివ్ డ్రెస్సింగ్‌తో ఆక‌ట్టుకుంటుంది. ఇటీవ‌లె పిల్లో ఛాలెంజ్ ట్రెండ్ క్రియేట్ చేసి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసిన పాయ‌ల్‌..లేటెస్ట్‌గా పేప‌ర్ డ్రెస్‌కు తెర‌తీసింది.

హాస్య బ్రహ్మ జంధ్యాల రూపొందించిన ఎవర్‌గ్రీన్ క్లాసిక్ సినిమా `అహ నా పెళ్లంట`. డబ్బులు ఆదా చేయడం కోసం ఆ సినిమాలో హీరో రాజేంద్రప్రసాద్ న్యూస్ పేపర్‌ను మడిచి లుంగీలాగ కట్టుకుంటాడు. ఇప్పుడు  హీరోయిన్ పాయల్ కూడా ఆ ఫ్యాషన్‌ను ఫాలో అయింది. న్యూప్‌పేప‌ర్స్‌నే డ్రెస్‌గా చుట్టుకొని ఫోటోలు పోస్ట్ చేసింది. కొంద‌రు పాయ‌ల్ క్రియేటివిని పొగుడుతుంటే మ‌రొకొంద‌రు మాత్రం పాయ‌ల్ డ్రెస్సింగ్‌పై మీమ్స్ చేస్తూ, తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆర్ ఎక్స్‌100 సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ భామ‌..మొద‌టి సినిమాతోనే హిట్టు కొట్టింది.  ఇటీవ‌లె పిల్లో డ్రెస్‌, ఇప్ప‌డు పేప‌ర్ డ్రెస్‌..మ‌రి నెక్స్ట్ ఎలాంటి క్రియేటివ్ డ్రెస్‌తో ముందుకొస్తుందో చూడాలి.!

Advertisement
 
Advertisement
Advertisement