చిరంజీవి 150వ సినిమాలో హీరోయిన్ ఖరారు! | Heroine finalise in Chiranjeevi 150th film! | Sakshi
Sakshi News home page

చిరంజీవి 150వ సినిమాలో హీరోయిన్ ఖరారు!

Apr 22 2015 3:37 PM | Updated on Jul 25 2018 3:13 PM

చిరంజీవి - Sakshi

చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న 150వ సినిమాలో హీరోయిన్ ఖరారైనట్లు టాలీవుడ్లో ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న 150వ సినిమాలో హీరోయిన్ ఖరారైనట్లు టాలీవుడ్లో ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రోడక్షన్‌ పనులు కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. మెగా ఫ్యాన్స్‌కి చిరంజీవి మళ్లీ కిక్ ఇస్తాడా?  చిరు మూవీకి ముహూర్తం ఎప్పుడు? ఈ మూవీలో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారు?  స్పెషల్ ఎప్పిరియన్స్ గా ఎంత మంది కనిపిస్తున్నారు? లాంటి విషయాలపై సినిమా వర్గాలలో ఆస్తకి నెలకొంది. ఇండస్ట్రీతో పాటు అంతటా ఇదే చర్చ.

మెగాస్టార్తో జోడీ కట్టబోయే ఆ లక్కీ హీరోయిన్ ఎవరో తేలిపోయింది. ఆ సీక్రెట్ రివీల్ అయ్యేసరికి మెగాఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాకు మొన్నటి వరకు కొత్త హిరోయిన్‌ను తీసుకొవాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఓల్డ్‌ బ్యూటీ  శ్రీదేవి, చిరంజీవి సరసన నటించే అవకాశం ఉందని అంటున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు టాలీవుడ్లో బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. 1990 దశకం చివరిలో సుప్రీం హీరో చిరంజీవి, ఆనాటి అందాల నటి శ్రీదేవి జంటగా నటించిన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మళ్ళీ అదే కాంబినేషన్‌ను రిపీట్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

చిరు 150వ సినిమాకి హైప్ క్రియేట్ కావాలంటే కచ్ఛితంగా గ్లామర్ క్రేజ్ ఉండాల్సిందే అని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను శ్రీదేవితో ఇప్పటికే మాట్లాడినట్లు, అగ్రిమెంట్కు సంబంధించిన పనులను కూడా పూర్తి అయినట్లుగా టాక్స్ వినిపిస్తున్నాయి. అదే నిజమైతే.. మెగాఫ్యాన్స్కు పండగే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement