చెర్రీ హీరోయిన్ ఫిక్స్ అయ్యింది | heroine confirmed for ram charans next | Sakshi
Sakshi News home page

చెర్రీ హీరోయిన్ ఫిక్స్ అయ్యింది

Dec 23 2015 12:52 PM | Updated on Sep 3 2017 2:27 PM

చెర్రీ హీరోయిన్ ఫిక్స్ అయ్యింది

చెర్రీ హీరోయిన్ ఫిక్స్ అయ్యింది

బ్రూస్ లీ సినిమాతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన మెగా పవర్స్టార్ రామ్చరణ్ తన నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

బ్రూస్ లీ సినిమాతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన మెగా పవర్స్టార్ రామ్చరణ్ తన నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్ను రీమేక్ చేస్తున్నట్టుగా ప్రకటించిన చెర్రీ ఆ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. సినిమాలో కీలకమైన విలన్ విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీ రాకపోయినా హీరోయిన్ విషయంలో మాత్రం ఫైనల్ డెసిషన్ తీసుకున్నారట.

రామ్చరణ్తో ఎవడు సినిమాలో కలిసి నటించిన శృతిహాసన్ తనీఒరువన్ రీమేక్లోనూ చరణ్తో కలిసి నటిస్తోంది. ఇప్పటికే శృతి కూడా తన అంగీకారాన్ని తెలపటంతో ఇక మిగతా పనుల మీద దృష్టిపెట్టారు చిత్రయూనిట్. విలన్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తారని భావించినా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుండటంతో ఇతర నటీనటులను ప్రయత్నిస్తున్నారట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement
 
Advertisement
Advertisement