ఇంటివాడు కాబోతున్న నితిన్‌.. పెళ్లి ఎప్పుడంటే | Hero Nithin Getting Married Shalini On April Month | Sakshi
Sakshi News home page

ఇంటివాడు కాబోతున్న నితిన్‌.. పెళ్లి ఎప్పుడంటే

Jan 24 2020 8:36 PM | Updated on Jan 24 2020 8:53 PM

Hero Nithin Getting Married Shalini On April Month - Sakshi

జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు హీరో నితిన్‌. టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్స్‌లో నితిన్‌ ఒక్కరు. హీరోగా ఎంట్రీ ఇచ్చి 17 సంవ్సరాలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు నితిన్‌ పెళ్లి విషయం గురించి మాట్లాడలేదు. తాజాగా నితిన్‌ త్వరలో ఓ ఇంటి వాడు అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నితిన్‌కు పెళ్లి ఫిక్స్‌ అయినట్లు.. ఏప్రిల్‌ 16న శాలిని అనే అమ్మాయితో నితిన్‌ ఏడడుగులు వేయబోతున్నట్లు టాక్‌. అయితే నితిన్‌ పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహన్ని చేసుకొనున్నారు.  యూకేలో ఎంబీఏ చేసిన శాలినిని నితిన్‌ నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడట. వీరి ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులకు తెలియజేసి పెళ్లికి ఒప్పించారట. ఇప్పటికే పెళ్లి పనులను కూడా ప్రారంభించినట్లు సమాచారం. పెళ్లి పనులన్నీ యువ నిర్మాత, నితిన్ సోదరి నిఖిత దగ్గరుండి చూసుకుంటుందట. 

కాగా నితిన్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోనున్నారు. దుబాయ్‌లోని ప్యాలసో వెర్సేస్‌ హోటల్‌లో వైభవంగా వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. అనంతరం హైదరాబాద్‌లో సన్నిహితులకు గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఇవ్వనున్నట్టు సమాచారం. నితిన్‌ ప్రస్తుతం చలో సినిమా దర్శకుడు వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భీష్మ’ సినిమాలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Advertisement
 
Advertisement
Advertisement