రూ.40కే సినిమాను అమ్మేస్తారా అంటూ హీరో ఆవేదన

Hero Nikhil Responded By Selling Piracy CDs On Roads - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిఖిల్ హీరోగా టీఎన్ సంతోష్ దర్శకత్వంలో వచ్చిన మూవీ అర్జున్‌ సురవరం.. మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అర్జున్‌ సురవరం మూవీకి హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను చిత్ర యూనిట్ నేరుగా కలుస్తోంది. ఈ సందర్భంగా గుంటూరు వెళ్లిన హీరో నిఖిల్‌ అక్కడ రోడ్డు మీద ఓ బండిపై తాజాగా విడుదలైన సినిమాలకు సంబంధించిన పైరసీ డీవీడీలను ఓ మహిళ అమ్ముతుండడం గమనించి షాక్‌కి గురయ్యాడు. ఎంతో కష్టపడి సినిమా తీస్తున్నాం.

చదవండి: వర్మకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన కేఏ పాల్‌

ఎందరో జీవితాలు సినిమాపై ఆధారపడి ఉంటాయి. ఇలా.. రూ.40కే మా సినిమాను అమ్మేస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఆ బండిపై సీడీలు విక్రయిస్తున్న మహిళ తనకు ఏమీ తెలియదని చెప్తూ.. తన కుటుంబ పోషణ కోసమే ఈ వ్యాపారం చేస్తున్నట్టు చెప్పింది. ఇక ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియోని నిఖిల్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top