నాగశౌర్యకు కాస్ట్లీ గిఫ్ట్‌.. ఎవరిచ్చారంటే! | hero Naga Shourya  gets Costly  Gift by his Mother | Sakshi
Sakshi News home page

నాగశౌర్యకు సూపర్‌ గిఫ్ట్‌..

Feb 27 2018 5:55 PM | Updated on Feb 27 2018 5:56 PM

hero Naga Shourya  gets Costly  Gift by his Mother - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యంగ్‌ హీరో నాగశౌర్య నటించిన ‘ఛలో’ చిత్రం సూపర్‌ హిట్‌ అయింది. ఈ విజయానందంలో తల్లి, నిర్మాత ఉషా ముల్పూరి నాగశౌర్యను సర్‌ప్రైజ్‌ చేశారట. ఆమె ఓ కాస్‌ట్లీ కారును బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది. ఆమె నాగశౌర్యకు పోర్షే 718 కెమెన్‌ అనే కారును కొనిచ్చారట. కారు విలువ దాదాపుగా రూ. 1.25 కోట్లు ఉంటుందని అంచనా. నాగశౌర్య తన ఇంటి వద్ద కారుతో దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

నాగశౌర్య మదర్‌ ‘ఛలో’ సినిమాకు నిర్మాత. ఈ మూవీ బాక్సాఫిస్‌ దగ్గర మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ‘ఛలో’  చిత్రానికి వెంకీ కుడుముల డైరెక్టర్‌. హీరోయిన్‌గా  రష్మికా మండన్న నటించింది. ఈ సినిమాను చాలా వినోదాత్మకంగా రూపొందించారు.

‘కణం’  తమిళ చిత్రంలో నాగశౌర్య హీరోగా నటించారు. హీరోయిన్‌గా సాయిపల్లవి నటించింది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement
 
Advertisement
Advertisement