ఆ ఆరు గంటల్లో ఏం జరిగింది? | Happy Birthday movie Srinandan Movies banner | Sakshi
Sakshi News home page

ఆ ఆరు గంటల్లో ఏం జరిగింది?

May 30 2016 12:04 AM | Updated on Sep 4 2017 1:12 AM

ఆ ఆరు గంటల్లో ఏం జరిగింది?

ఆ ఆరు గంటల్లో ఏం జరిగింది?

సాయంత్రం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో ఓ బర్త్‌డే పార్టీ జరుగుతుంది. ఆ పార్టీలో చోటు చేసుకునే సంఘటనలేంటి?

సాయంత్రం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో ఓ బర్త్‌డే పార్టీ జరుగుతుంది. ఆ పార్టీలో చోటు చేసుకునే సంఘటనలేంటి? ఆ తర్వాత ఏం జరిగింది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. చెన్నమనేని శ్రీధర్, జ్యోతీసేథ్, సంజన, శ్రవణ్ ప్రధాన పాత్రల్లో పల్లెల వీరారెడ్డి (చేగువేరా) దర్శకత్వంలో శ్రీనందన్ మూవీస్ పతాకంపై మహేశ్ కల్లే నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘పుట్టినరోజు వేడుక నేపథ్యంలో ఒకే ఇంట్లో సాగే కథ ఇది. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది. గ్రాఫిక్స్ హైలెట్‌గా నిలుస్తాయి’’ అని చెప్పారు.

‘‘కథ, కథనాలు ఆసక్తిగా ఉంటాయి. వైజాగ్, హైదరాబాద్‌లో మేజర్ పార్ట్  షూటింగ్ జరిపాం. కీలక సన్నివేశాలు విదేశాల్లో చిత్రీకరించాం. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. త్వరలో పాటలు విడుదల చేస్తాం. జులైలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాత మహేశ్ తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: వాసిరెడ్డి సత్యానంద్, సంగీతం: సంతోష్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటేశ్వరరావు.

Advertisement
 
Advertisement
Advertisement