రామ్తో అనుభవం చెప్పలేనిది: సన్నీలియోన్ | Had the best time shooting with Ram Kapoor: Sunny Leone | Sakshi
Sakshi News home page

రామ్తో అనుభవం చెప్పలేనిది: సన్నీలియోన్

Apr 27 2015 1:35 PM | Updated on Apr 3 2019 6:23 PM

రామ్తో అనుభవం చెప్పలేనిది: సన్నీలియోన్ - Sakshi

రామ్తో అనుభవం చెప్పలేనిది: సన్నీలియోన్

రామ్ కపూర్తో కలిసి నటిస్తున్నంత సేపు చాలా ఆహ్లాదంగా గడిచిందని బాలీవుడ్ నటి, శృంగార తార సన్నీ లీయోన్ అంది.

ముంబయి: రామ్ కపూర్తో కలిసి నటిస్తున్నంత సేపు చాలా ఆహ్లాదంగా గడిచిందని బాలీవుడ్ నటి, శృంగార తార సన్నీ లీయోన్ అంది. అతడు నిజమైన హాస్యనటుడు అని ఆమె పేర్కొంది. తొలిసారి రామ్ కపూర్తో కలిసి కుచ్ కుచ్ లోచా హాయ్ చిత్రంలో నటిస్తున్న ఆమె.. సెట్స్లో రామ్ తో ఉన్నంత సేపు చిత్ర బృందమంతా చాలా సంతోషంగా గడిపేవాళ్లమని ఆ అనుభూతిని చెప్పలేనని అన్నారు. అతడు చాలా ఫన్నీ గాయ్ అని, సో ఫన్నీ అని చెప్పింది. అతడు ఎవరినైనా ఇట్టే నవ్వించగలడని చెప్పింది.

ఈ చిత్రంలో రామ్ కపూర్ 45 ఏళ్ల పెళ్లైన వ్యక్తిగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ షనయా(సన్నీ లియోన్)ను కలిసే అవకాశం పొందుతాడు. ఈ సందర్భంగా జరిగే సన్నివేశాలు చాలా ఆనందాన్నివ్వనున్నట్లు చిత్ర దర్శకుడు దేవంగ్ దలోకియా తెలిపారు. ఈ చిత్రం మే 8న వెండితెరను పలకరించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement