Kuch Kuch Locha Hai
-
హైదరాబాద్‌లో సన్నీలియోన్
-
ఆ అనుభవం చెప్పలేను.. ఆమెతో మళ్లీ నటిస్తా..
ముంబయి: బాలీవుడ్ శృంగార తార సన్నీలీయోన్తో కలిసి పనిచేయడం తనకు చాలా హాయిగా ఉందని అంటున్నాడు రామ్ కపూర్. ఇప్పటికే ఆమెతో కలిసి కుచ్ కుచ్ లోచా హాయ్ అనే చిత్రంలో నటించిన ఆయన ఆ అనుభవం మరిచిపోలేనిదని, ఆరోజులు ఎంతో హాయిగా గడిపోయాయని చెప్తున్నాడు. తాను మరోసారి ఆమెతో జత కట్టబోతున్నానని, ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో సన్నీతో కలిసి నటిస్తున్నట్లు చెప్పారు. ' అది నిజంగా చెప్పలేని ఆనందం. మా మొదటి చిత్రానికి చాలా గొప్పగా కలిసి పనిచేశాం. సన్నీ చాలా కష్టపడి పనిచేస్తుంది. బాగా ఫన్నీ.. ప్రొఫెషనల్ కూడా.. త్వరలో మరో చిత్రంలో ఆమెతో కలిసి నటిస్తున్నాను. అయితే, కామెడీ చిత్రం కాదు. 2015 చివరికి ఆ చిత్రం పూర్తవుతుంది' అని ఆయన చెప్పారు. -
రామ్‌తో అనుభవం చెప్పలేనిది: సన్నీలియోన్
ముంబయి: రామ్ కపూర్‌తో కలిసి నటిస్తున్నంత సేపు చాలా ఆహ్లాదంగా గడిచిందని బాలీవుడ్ నటి, శృంగార తార సన్నీ లీయోన్ అంది. అతడు నిజమైన హాస్యనటుడు అని ఆమె పేర్కొంది. తొలిసారి రామ్ కపూర్‌తో కలిసి కుచ్ కుచ్ లోచా హాయ్ చిత్రంలో నటిస్తున్న ఆమె.. సెట్స్‌లో రామ్ తో ఉన్నంత సేపు చిత్ర బృందమంతా చాలా సంతోషంగా గడిపేవాళ్లమని ఆ అనుభూతిని చెప్పలేనని అన్నారు. అతడు చాలా ఫన్నీ గాయ్ అని, సో ఫన్నీ అని చెప్పింది. అతడు ఎవరినైనా ఇట్టే నవ్వించగలడని చెప్పింది. ఈ చిత్రంలో రామ్ కపూర్ 45 ఏళ్ల పెళ్లైన వ్యక్తిగా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ షనయా(సన్నీ లియోన్)ను కలిసే అవకాశం పొందుతాడు. ఈ సందర్భంగా జరిగే సన్నివేశాలు చాలా ఆనందాన్నివ్వనున్నట్లు చిత్ర దర్శకుడు దేవంగ్ దలోకియా తెలిపారు. ఈ చిత్రం మే 8న వెండితెరను పలకరించనుంది.