జైలుకెళ్లిన జీవీ ప్రకాశ్‌ | GV Prakash-Vasanthabalan film titled 'Jail', first look poster released | Sakshi
Sakshi News home page

జైలుకెళ్లిన జీవీ ప్రకాశ్‌

Aug 5 2018 2:25 AM | Updated on Aug 5 2018 2:25 AM

GV Prakash-Vasanthabalan film titled 'Jail', first look poster released - Sakshi

జీవీ ప్రకాశ్‌

జైల్లో ఊసలు లెక్కపెడుతున్నారు సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌. తప్పేం చేయలేదు కానీ చేసిన వారిని ప్రశ్నిస్తే చేతికి బేడీలు వేశారట. మరి.. ఆయన జైలు జీవితం ఎలా గడిచిందనేది సిల్వర్‌ స్క్రీన్‌పై చూడాల్సిందే. వసంతబాలన్‌ దర్శకత్వంలో జీవీ ప్రకాశ్‌ హీరోగా రూపొందుతోన్న సినిమా ‘జైలు’. ఈ సినిమాలో కరుణ అనే క్యారెక్టర్‌లో జీవీ నటిస్తున్నారు.

‘‘జైలు’ నా కెరీర్‌లో ఇంపార్టెంట్‌ మూవీగా నిలుస్తుందన్న నమ్మకం నాకు ఉంది’’ అన్నారు జీవీ ప్రకాశ్‌. లోయర్‌ మిడిస్‌ క్లాస్‌ ఫ్యామిలీస్‌ ఎదుర్కొంటున్న హౌసింగ్‌ ప్రాబ్లమ్స్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని కోలీవుడ్‌ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. పన్నెండేళ్ల క్రితం వసంతబాలన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘వెయిల్‌’ సినిమాతో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన జీవీ ప్రకాశ్‌   ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే హీరోగా నటిస్తుండటం విశేషం. అంతేకాదు ఈ చిత్రానికి కూడా జీవీనే స్వరకర్త అట.

Advertisement
 
Advertisement
Advertisement