యమ జోరు | gopichand new movie with sampath nandi | Sakshi
Sakshi News home page

యమ జోరు

Sep 20 2019 12:30 AM | Updated on Sep 20 2019 12:30 AM

gopichand new movie with sampath nandi - Sakshi

సంపత్‌ నంది, గోపీచంద్‌

హీరో గోపీచంద్‌ యమ జోరు మీద ఉన్నారు. వెంట వెంటనే సినిమాలు ఒప్పుకుంటూ కెరీర్‌లో స్పీడ్‌ పెంచారు. ఇటీవలే బిన్ను సుబ్రహ్మణ్యం దర్శకడిగా పరిచయమవుతున్న సినిమాలో హీరోగా నటించనున్నట్లు తెలియజేసిన గోపీచంద్‌ తాజాగా మరో కొత్త సినిమాకు సై అన్నారు. సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు.

గోపీచంద్‌ కెరీర్‌లో ఇది 28వ చిత్రం. ‘‘హై బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను నిర్మించనున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి. మరో వైపు గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చాణక్య’ ఈ దసరాకు విడుదల కానుంది. ఈ సినిమాకు తిరు దర్శకుడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement