ఏజెంట్‌ చాణక్య | Gopichand chanakya released on september | Sakshi
Sakshi News home page

ఏజెంట్‌ చాణక్య

Aug 16 2019 12:09 AM | Updated on Aug 16 2019 12:09 AM

Gopichand chanakya released on september - Sakshi

గోపీచంద్‌

‘చాణక్య’ ఎత్తులకు పై ఎత్తులు వేస్తాడు. దేన్నైయినా విశ్లేషించగలుగుతాడు. అతను పరిశోధన మొదలుపడితే ఏ కేస్‌ అయినా పరిష్కారం కావాల్సిందే. మరి.. చాణక్య ఎలాంటి ప్లాన్‌లు వేశాడు? అనేది వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే. గోపీచంద్‌ హీరోగా తిరు దర్శకత్వంలో ‘చాణక్య’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో మెహరీన్, జరీన్‌ఖాన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘రా’ (రీసెర్చ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌) ఏజెంట్‌ పాత్రలో గోపీచంద్‌ నటిస్తున్నారని తెలిసింది.

తాజాగా ఈ సినిమాలో గోపీచంద్‌ కొత్త లుక్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమా టాకీ పార్ట్‌ పూర్తయింది. పాటలను విదేశాల్లో చిత్రీకరించడానికి ప్లాన్‌ చేస్తున్నారు. డబ్బింగ్‌ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌లో ఈ సినిమాను విడుదల చేయాలను కుంటున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అజయ్‌ సుంకర, అభిషేక్‌ అగర్వాల్‌ సహ–నిర్మాతలు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌ గిరికిపాటి.

Advertisement
 
Advertisement
Advertisement