ఆ డైరెక్టర్ తో సినిమా ఒప్పుకుంటారా..? | Financial issues troubling Lingusamy Telugu Project | Sakshi
Sakshi News home page

ఆ డైరెక్టర్ తో సినిమా ఒప్పుకుంటారా..?

Feb 27 2016 1:56 PM | Updated on Sep 3 2017 6:33 PM

ఆ డైరెక్టర్ తో సినిమా ఒప్పుకుంటారా..?

ఆ డైరెక్టర్ తో సినిమా ఒప్పుకుంటారా..?

తమిళ దర్శకుడు లింగుసామి తెలుగు హీరోల మీద కన్నేశాడు. ఇప్పటికే పందెంకోడి, ఆవారా లాంటి సినిమాలతో తెలుగులో కూడా మంచి విజయాలు సాధించిన ఈ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్...

తమిళ దర్శకుడు లింగుసామి తెలుగు హీరోల మీద కన్నేశాడు. ఇప్పటికే పందెంకోడి, ఆవారా లాంటి సినిమాలతో తెలుగులో కూడా మంచి విజయాలు సాధించిన ఈ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, ప్రస్తుతం స్ట్రయిట్ తెలుగు సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. అంతేకాదు తెలుగు సినిమా కోసం విశాల్ హీరోగా తెరకెక్కించాలనుకున్న పందెంకోడి సీక్వల్ను కూడా పక్కన పెట్టేశాడు లింగుసామి.

ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరోలు అల్లు అర్జున్, ఎన్టీఆర్లకు కథలు వినిపించిన లింగుసామి, వారి డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఎన్టీఆర్ ఈ మధ్యే కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమా మొదలు పెట్టాడు కాబట్టి ఇప్పట్లో డేట్స్ ఇచ్చే అవకాశం లేదు. బన్నీ హీరోగా నటిస్తున్న సరైనోడు ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. దీంతో స్టైలిష్ స్టార్తోనే తన నెక్ట్స్ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు ఈ మాస్ డైరెక్టర్.

తమిళ నాట ఫైనాల్షియల్ ప్రాబ్లమ్స్తో పాటు. పందెకోడి సీక్వల్ను ఆపేసి విశాల్ ఆగ్రహానికి కూడా గురైన లింగుసామితో కలిసి పనిచేయడానికి మన బన్నీ, తారక్లు అంగీకరిస్తారో లేదో అన్న టాక్ కూడా వినిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement