దుమ్మురేపుతున్న 'ఫిదా' వసూళ్లు | Fidaa Film 2 weeks collections | Sakshi
Sakshi News home page

దుమ్మురేపుతున్న 'ఫిదా' వసూళ్లు

Aug 6 2017 4:48 PM | Updated on Sep 17 2017 5:14 PM

దుమ్మురేపుతున్న 'ఫిదా' వసూళ్లు

దుమ్మురేపుతున్న 'ఫిదా' వసూళ్లు

బాక్సాఫీస్‌ వద్ద 'ఫిదా' జోరు కొనసాగుతోంది.

బాక్సాఫీస్‌ వద్ద 'ఫిదా' జోరు కొనసాగుతోంది. మూడు వారంలోనూ ప్రేక్షకుల ఆదరణ కొనసాగుతుండడంతో కలెక్షన్లు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా విడుదలైన సినిమాలేవి కనీస పోటీ ఇవ్వలేకపోడంతో 'ఫిదా'కు తిరుగులేకుండా పోయింది. జూలై 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి రెండు వారాల్లో రూ. 60 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది. రెండో వారంలో రూ.11.05 కోట్ల షేర్‌ అందుకుంది.

ఈ ఏడాది విడుదలైన తెలుగు సినిమాల్లో సెకండ్‌ వీక్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో చిత్రంగా నిలిచింది. బాహుబలి 2, ఖైదీ నంబర్‌ 150 సినిమాలు దీనికంటే ముందున్నాయి. రెండో వారం కలెక్షన్లలో ఫిదా కంటే కాటమరాయుడు, డీజే- దువ్వాగ జగ్ననాథం వెనుకబడివున్నాయి.

రొమాంటిక్ ఎంటర్టైనర్గా శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన 'ఫిదా' అమెరికాలోనే రెండు వారాల్లో రూ.11.10 కోట్లు రాబట్టింది.  ఓవర్‌సీస్‌లో 2 మిలియన్ల మైలురాయిని చేరుకుంటుందని ట్రేడ్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రేక్షకుల ఆదరణ ఇలాగే కొనసాగితే మున్ముందు ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement