ఫెఫ్సీ సమ్మె విరమణ | Fefcey members are shooting since Friday | Sakshi
Sakshi News home page

ఫెఫ్సీ సమ్మె విరమణ

Aug 4 2017 1:43 AM | Updated on Sep 17 2017 5:07 PM

ఫెఫ్సీ సమ్మె విరమణ

ఫెఫ్సీ సమ్మె విరమణ

మూడు రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెను దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) గురువారం సమ్మెను విరమించుకుంటున్నట్టు ప్రకటించింది.

తమిళసినిమా: మూడు రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెను దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) గురువారం సమ్మెను విరమించుకుంటున్నట్టు ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఫెఫ్సీ నిర్వాహకులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కె.సెల్వమణి మాట్లాడుతూ  మూడు రోజులుగా 40 చిత్రాలకు పైగా షూటింగ్‌లకు ఇబ్బంది ఏర్పడిందన్నారు. నటుడు రజనీకాంత్, దర్శకుల సంఘం ఇతర సినీ ప్రముఖులు విజ్ఞప్తి మేరకు ఫెఫ్సీ సభ్యులతో చర్చలు నిర్వహించి సమ్మెను విరమించుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. శుక్రవారం నుంచి యథాతథంగా ఫెఫ్సీ సభ్యులు షూటింగ్‌లలో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement