
'అప్పుడే ఎనిమిదేళ్లు గడచిపోయాయి'
డైరెక్టర్ గా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్లు 30లక్షలకు చేరుకున్నారు. .
ముంబై : డైరెక్టర్ గా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్లు 30లక్షలకు చేరుకున్నారు. 43 ఏళ్ల వయస్సులో ఐవీఎఫ్ ట్రీట్ మెంట్ ద్వారా ముగ్గురు పిల్లలకు తల్లి అయిన ఫరా.. గురువారం వారి 8వ పుట్టినరోజు వేడుకలను జరిపారు. ముగ్గురు పిల్లలు అన్య, సీజర్, దివాలు చిన్నప్పటి ఫొటోతోపాటు ప్రస్తుతం ఎలా ఉన్నారో తెలిపే మరో ఫోటోను అభిమానుల కోసం ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
'జీవితానికున్న అసలైన అర్థం చూడకుండా ఉండకండి, సమయం చాలా వేగంగా ఎగిరిపోతుంటుంది. చూస్తుండగానే ఎనిమిదేళ్లు గడచిపోయాయి. మనం ప్రేమించేవాళ్లు ఉంటే నిజంగానే సమయం ఎగిరిపోతుంది, లేదంటే క్షణమొక యుగంలా అసలు కదలనే కదలదంటూ' ఫొటోలతో పాటు ట్వీట్ చేసి మాతృత్వపు మాధుర్యాన్ని ఎంతగా చవిచూస్తున్నారో చెప్పకనే చెప్పారు ఈ హ్యాపీ న్యూ ఇయర్ డైరెక్టర్.
ఫరాఖాన్ ఎడిటర్, డైరెక్టర్ శిరీష్ కుందర్‌ను 2004లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తన చిన్నారుల పుట్టినరోజునే 30లక్షలకు చేరుకున్న అభిమానులను ట్విట్టర్ ఫ్యామిలీగా పేర్కొంటూ 'సదా నాతో ఉన్న అభిమానులందరికీ కృతజ్ఞతలు' అని తెలిపారు ఫరాఖాన్.
Never lose sight of what life truly is meant to be..Time flies quicker than v know..2realise that wait 4 next tweet pic.twitter.com/MLlbu1ZEft
— Farah Khan (@TheFarahKhan) February 11, 2016
8 yrs today!! Like I said.. Time flies..with the ones u love.. Without them it doesn't even move.. pic.twitter.com/BssxdrKqjW
— Farah Khan (@TheFarahKhan) February 11, 2016