రూ.1.25 కోట్లు ఇస్తే ఓకే | Fading Beauty demands Rs 1.25 crore for Balayya film | Sakshi
Sakshi News home page

రూ.1.25 కోట్లు ఇస్తే ఓకే

May 22 2014 11:26 PM | Updated on Aug 28 2018 4:30 PM

రూ.1.25 కోట్లు ఇస్తే ఓకే - Sakshi

రూ.1.25 కోట్లు ఇస్తే ఓకే

రూ. 1.25 కోట్లు పారితోషికం ఇస్తే తాను నటించేందుకు సిద్ధమని చెన్నై చిన్నది త్రిష డిమాండ్ చేస్తోందట. లక్కీ అంటే ఈ బ్యూటీదేనని చెప్పక తప్పదు. మూడు పదుల వయసు

 రూ. 1.25 కోట్లు పారితోషికం ఇస్తే తాను నటించేందుకు సిద్ధమని చెన్నై చిన్నది త్రిష డిమాండ్ చేస్తోందట. లక్కీ అంటే ఈ బ్యూటీదేనని చెప్పక తప్పదు. మూడు పదుల వయసు దాటినా హీరోయిన్‌గా చెలామణి అవుతోంది. అంత బిజీ కాకపోయినా చిత్రం తర్వాత చిత్రం అంటూ గ్యాప్ లేకుండా అవకాశాలు రాబట్టుకుంటోంది. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్న ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో సీనియర్ నటుడు బాలకృష్ణ హీరోగా నటించే చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం వచ్చిందట. ఇందులో మరో హీరోయిన్‌గా శ్రీయ నటించనుంది.
 
 లెజెండ్ చిత్రం తర్వాత బాలకృష్ణ నటించనున్న ఈ చిత్రం ఆయన పుట్టిన రోజు అయిన జూన్ 6న ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో నటించడానికి త్రిష రూ.1.25 కోట్లు పారితోషికం డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అవాక్ అరుున నిర్మాత ఇతర హీరోయిన్లను పరిశీలించే పనిలో పడ్డారట. నటి అంజలిని సంప్రదించగా ఆమె ఆసక్తి చూపలేదని సమాచారం. అలాగే ఇంతకు ముందు లెజెండ్ చిత్రంలో బాలకృష్ణతో జతకట్టిన నటి రాధిక ఆప్తేను ఎంపిక చేయాలని ప్రయత్నించారు. ఆమె నిరాకరించినట్లు తెలిసింది. ఇక నయనతార పేరు పరిశీలించగా ఆమె ఇతర చిత్రాలతో బిజీగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఎటూ పాలుపోని ఆ నిర్మాత త్రిష డిమాండ్‌ను నెరవేర్చాలా? లేక నూతన హీరోయిన్‌ను ఎంపిక చేసుకుందామా? అనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement