సుశాంత్ కుక్క మ‌ర‌ణం: నిజ‌మేనా? | Fact Check: Sushanth Singh Rajputh Dog Is Alive | Sakshi
Sakshi News home page

సుశాంత్ పెంచుకున్న శున‌కం బ‌తికే ఉంది

Jun 23 2020 2:48 PM | Updated on Jun 23 2020 9:06 PM

Fact Check: Sushanth Singh Rajputh Dog Is Alive - Sakshi

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం దేశవ్యాప్తంగా ఎంతోమందిని కుంగ‌దీసిన విష‌యం తెలిసిందే. అత‌డి మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక కొంద‌రు అభిమానులు ప్రాణాలు సైతం తీసుకున్నారు. ఈ క్ర‌మంలో సుశాంత్ ఇంట్లో ఉంటే క్ష‌ణం వ‌దిలిపెట్ట‌కుండా వెన్నంటే తోకూపుకుంటూ తిరిగే అత‌డి కుక్క కూడా చ‌నిపోయిందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. అత‌డు ఈ లోకం నుంచి నిష్క్ర‌మించిన నాటి నుంచి ఆ కుక్క తిండీనీళ్లూ మానేసి మౌనంగా రోదిస్తోందంటూ కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీంతో నిజానిజాలు తెలుసు‌కోకుండానే ఎంతోమంది ఆ శున‌కం చ‌నిపోయింద‌ని న‌మ్ముతూ నివాళులు సైతం అర్పిస్తున్నారు. వాస్త‌వ‌మేంటంటే.. సుశాంత్ పెంచుకున్న కుక్క ఫ‌డ్జ్ చ‌నిపోలేదు. (సుశాంత్‌ నా బిడ్డగా పుట్టబోతున్నాడు: నటి)

అత‌డు శాశ్వ‌తంగా వీడ్కోలు తీసుకున్న‌ రోజు నుంచి అది దిగులుగానే ఉంది. సుశాంత్ ఇక తిరిగి రాడ‌ని తెలీక ఇప్ప‌టికీ అత‌డి కోసం ఎదురుచూస్తూనే ఉంది. అయితే సోష‌ల్ మీడియా దుష్ప్ర‌చారం ప్ర‌కారం అది మ‌ర‌ణించ‌లేదు. దీనితోపాటు సుశాంత్ పెంచుకుంటున్న నాలుగు కుక్క‌లు ఆరోగ్యంగానే ఉన్నాయ‌ని అత‌ని బంధువు ఒక‌రు వెల్ల‌డించారు. కాగా సుశాంత్‌ ఫ‌డ్జ్‌తో క‌లిసి ఆడుకుంటున్న వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను కంట‌త‌డి పెట్టిస్తోంది. ఫోన్‌లో సుశాంత్ ఫొటోను త‌దేకంగా చూస్తున్న ఫ‌డ్జ్ ఫొటో చూసిన‌ నెటిజ‌న్ల గుండె బ‌రువెక్కుతోంది. (సుశాంత్‌కు గొప్ప నివాళి)

Advertisement
 
Advertisement
Advertisement