హాయ్‌ హైదరాబాద్‌

Evelyn Sharma Off to Hyderabad to continue shoot for saaho - Sakshi

ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తోన్న సినిమా ‘సాహో’. ఈ సినిమాతో సౌత్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు జర్మన్‌ బ్యూటీ ఎవెలిన్‌ శర్మ. ఈ సినిమా కోసం తెలుగు భాషపై దృష్టి పెట్టారామె.  ఈ చిత్రం సెట్స్‌లో ప్రభాస్‌ దగ్గర అప్పుడప్పుడు తెలుగు నేర్చుకుంటున్నారట ఎవెలిన్‌. ఇప్పుడీ బ్యూటీ హైదరాబాద్‌ వస్తున్నారు.

అవును.. హైదరాబాద్‌లో మొదలైన ‘సాహో’ థర్డ్‌ షెడ్యూల్‌లో పాల్గొనేందుకే వస్తున్నారు. ‘‘సాహో’ సినిమా షూటింగ్‌ను కంటిన్యూ చేసేందుకు హైదరాబాద్‌ రాబోతున్నాను’’ అని ఎవెలిన్‌ పేర్కొన్నారు. ఆల్రెడీ నీల్‌ నితిన్‌ ముఖేష్, మురళీ శర్మ షూట్‌లో జాయిన్‌ అయిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న ‘సాహో’ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top