జనతా గ్యారేజ్కు మరో టెన్షన్ | Eros Sudden Entry To janatha Garage | Sakshi
Sakshi News home page

జనతా గ్యారేజ్కు మరో టెన్షన్

Aug 27 2016 11:32 AM | Updated on Sep 4 2017 11:10 AM

జనతా గ్యారేజ్కు మరో టెన్షన్

జనతా గ్యారేజ్కు మరో టెన్షన్

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జనతా గ్యారేజ్. భారీ అంచనాల మధ్య ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా సక్సెస్పై చిత్రయూనిట్తో అభిమానులు కూడా చాలా...

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జనతా గ్యారేజ్. భారీ అంచనాల మధ్య ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా సక్సెస్పై చిత్రయూనిట్తో పాటు అభిమానులు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే ఇన్నాళ్లు సినిమా సక్సెస్ మీద ఎంతో ధైర్యంగా ఉన్న అభిమానులకు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది.

ఇప్పటికే సినిమా ప్రమోషన్లో వేగం పెంచిన చిత్రయూనిట్ చాలా పోస్టర్లనే రిలీజ్ చేసింది. అయితే తాజాగా రిలీజ్ అయిన పోస్టర్లను చూసిన జూనియర్ అభిమానులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. శుక్రవారం జనతా గ్యారేజ్ సినిమా సెన్సార్ పూర్తి అయిన సందర్భంగా చిత్రయూనిట్ కొత్త పోస్టర్లను రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్లపై దర్శనమిస్తున్న ఈరోస్ లోగోనే అభిమానుల భయానికి కారణం.

కొద్ది రోజుల క్రితమే తెలుగు సినిమాల డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టిన ఈరోస్ సంస్ధ ఇప్పటి వరకు స్టార్ హీరోల సినిమాల బాద్మతలను మాత్రమే తీసుకుంటూ వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం డిజాస్టర్లుగా నిలిచాయి. 1 నేనొక్కడినే నుంచి తన ప్రయాణం మొదలుపెట్టిన ఈరోస్ సర్థార్ గబ్బర్సింగ్ వరకు భారీ డిజాస్టర్లను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. కొన్ని సక్సెస్ ఫుల్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసినా.. సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువ దీంతో ఇప్పుడు జనతా గ్యారేజ్ను ఇదే సంస్థ రిలీజ్ చేస్తుండటంతో సినిమా రిజల్ట్ ఏమవుతుందో అని భయపడుతున్నారు ఫ్యాన్స్.

Advertisement
 
Advertisement
Advertisement