breaking news
EROs
-
రిలయన్స్‌కి ఈరోస్ ఇంటర్నేషనల్‌లో 5 శాతం వాటా
ముంబై: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ మీడియా సంస్థ, ఈరోస్ ఇంటర్నేషనల్‌లో 5 శాతం వాటాను కొనుగోలు చేయనున్నది. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో లిస్టయిన ఈరోస్ ఇంటర్నేషనల్‌లో 5 శాతం వాటాను ఒక్కో షేర్‌ను 15 డాలర్లకు (సోమవారం ఈరోస్ ఇంటర్నేషనల్ ముగింపు ధరతో పోల్చితే ఇది 18 శాతం అధికం)రిలయన్స్ ఇండస్ట్రీస్ తన అనుబంధ కంపెనీ ద్వారా కొనుగోలు చేయనున్నది. అన్ని భారత భాషల్లో సినిమాలు నిర్మించడానికి, అన్ని భారత భాషల్లో నిర్మితమవుతున్న సినిమాల డిజిటల్ హక్కులను పొందడానికి రిలయన్స్, ఈరోస్ ఇంటర్నేషనల్ కంపెనీలు చెరో రూ.500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నాయి. -
జనతా గ్యారేజ్‌కు మరో టెన్షన్
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జనతా గ్యారేజ్. భారీ అంచనాల మధ్య ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా సక్సెస్‌పై చిత్రయూనిట్‌తో పాటు అభిమానులు కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అయితే ఇన్నాళ్లు సినిమా సక్సెస్ మీద ఎంతో ధైర్యంగా ఉన్న అభిమానులకు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్లో వేగం పెంచిన చిత్రయూనిట్ చాలా పోస్టర్లనే రిలీజ్ చేసింది. అయితే తాజాగా రిలీజ్ అయిన పోస్టర్లను చూసిన జూనియర్ అభిమానులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. శుక్రవారం జనతా గ్యారేజ్ సినిమా సెన్సార్ పూర్తి అయిన సందర్భంగా చిత్రయూనిట్ కొత్త పోస్టర్లను రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్లపై దర్శనమిస్తున్న ఈరోస్ లోగోనే అభిమానుల భయానికి కారణం. కొద్ది రోజుల క్రితమే తెలుగు సినిమాల డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టిన ఈరోస్ సంస్ధ ఇప్పటి వరకు స్టార్ హీరోల సినిమాల బాద్మతలను మాత్రమే తీసుకుంటూ వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం డిజాస్టర్లుగా నిలిచాయి. 1 నేనొక్కడినే నుంచి తన ప్రయాణం మొదలుపెట్టిన ఈరోస్ సర్థార్ గబ్బర్‌సింగ్ వరకు భారీ డిజాస్టర్లను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. కొన్ని సక్సెస్ ఫుల్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసినా.. సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువ దీంతో ఇప్పుడు జనతా గ్యారేజ్‌ను ఇదే సంస్థ రిలీజ్ చేస్తుండటంతో సినిమా రిజల్ట్ ఏమవుతుందో అని భయపడుతున్నారు ఫ్యాన్స్. -
నిర్లక్ష్యానికి ఓటేశారు!
- ముందుకు సాగని ఓటర్ల ఆధార్‌తో అనుసంధానం - 30 రోజుల్లో 6.86శాతం మాత్రమే - పట్టనట్లు వ్యవహరిస్తున్న తహశీల్దార్లు, ఈఆర్ఓలు - మొత్తం ఓటర్లు 30,88,307 మంది - ఆధార్ సీడింగ్ చేసింది 26255 మాత్రమే - జిల్లాలో దాదాపు 3 లక్షల వరకు బోగస్ ఓటర్లు - నేడు ఆధార్ సీడింగ్‌పై ఉన్నత స్థాయి సమీక్ష కర్నూలు(అగ్రికల్చర్): ఓటర్లను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేయడంలో సర్వత్రా నిర్లక్ష్యం నెలకొంది. గతనెల 1వ తేదీ నుంచి ఓటర్లను ఆధార్‌తో సీడింగ్ చేయడం మొదలైంది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 30,88,307 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరి నుంచి ఎపిక్ కార్డుల నంబర్లు, ఆధార్ నంబర్లు సేకరించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంది. దాదాపు నెల రోజులుగా ఆధార్ సీడింగ్ కార్యక్రమం జరుగుతున్నా ఇంత వరకు కేవలం 26255 (6.86శాతం) ఓటర్లను మాత్రమే ఆధార్ తో అనుసంధానం చేశారు. బీఎల్ఓలు 447785 మంది ఓటర్ల ఆధార్ నెంబర్లను వెరిఫై చేసినా సీడింగ్ మాత్రం నామమాత్రంగా ఉంది. మే నెల 15లోగా ఓటర్లను ఆధార్‌తో సీడింగ్ చేయడం పూర్తి చేయాల్సి ఉన్నా అడుగడుగునా నిర్లక్ష్యం నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. జిల్లాలోని మొత్తం ఓటర్లలో బోగస్ ఓటర్లు దాదాపు 3 లక్షల ఓటర్లు ఉన్నట్లు అంచనా. ఒక వ్యక్తికి ఆధార్ నెంబర్ ఒక్కటే ఉంటుంది. ఆధార్ నెంబర్ ఒక్క ఎపిక్ కార్డుకే లింకప్ అవుతుంది. ఇందువల్ల ఓటర్లను ఆధార్‌తో సీడింగ్ చేస్తే బోగస్ ఓటర్లు బయటపడే అవకాశం ఉన్నా... ఈ కార్యక్రమం పట్ల సర్వత్రా నిర్లక్ష్యం నెలకొంది. మంత్రాలయం, కర్నూలు, శ్రీశైలం, నంద్యాల, డోన్, పాణ్యం,ఆలూరు నియోజకవర్గాల్లో ఆధార్ సీడింగ్ మరింత దయనీయంగా ఉంది. కంప్యూటర్లు, ఆపరేటర్ల కొరతతో పురోగతి లేదనే అభిపాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో పురోగతి లేకపోవడంతో రాష్ట్ర ఎన్నికల జాయింట్ సీఈఓ ఆదివారం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నారు. ఆధార్ సీడింగ్ ఇలా చేసుకోవచ్చు ఓటర్లు సెల్ఫ్ సీడింగ్ చేసుకోవచ్చు. ఎపిక్ నెంబర్, ఆధార్ నెంబర్లను ఎస్ఎంఎస్ చేయవచ్చు. కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఈ నెంబర్లు చెప్పవచ్చు. ఎవరికి వారు వివిధ మార్గాల్లో సీడింగ్ చేసుకున్నా చివరికి వీటిని బీఎల్ఓలు విధిగా ధృవీకరించాల్సి ఉంది. జ్ట్టిఞ//164.100.132.184్ఛఞజీఛి పోర్టర్లో ప్రతి ఓటరు తమ ఎపిక్ కార్డు నెంబర్‌ను ఆధార్ సంఖ్యతో స్వయంగా అనుసంధానం చేసుకోవచ్చు. ఈ అడ్రస్ ద్వారా పోర్టర్‌ను ఓపెన్ చేసి సెల్ఫ్ సీడింగ్‌కు ఎదురుగా ఉన్న ‘క్లిక్ హియర్ టు ప్రొసీడ్’ బటన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ నమోదు చేసి జనరేట్ ఓటీపీ నెంబర్ క్లిక్ చేయాలి. అప్పుడు మొబైల్ నెంబర్ వచ్చిన ఓటీపీ కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఓటరు యొక్క వివరాలు చూపబడతాయి. వివరాలు సరైనచో సీడ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. -
రజనీకాంత్ 'విక్రమసింహ' ట్రైలర్