రిలయన్స్‌కి ఈరోస్‌ ఇంటర్నేషనల్‌లో 5 శాతం వాటా | Reliance has 5% share in Eros International | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌కి ఈరోస్‌ ఇంటర్నేషనల్‌లో 5 శాతం వాటా

Feb 21 2018 12:48 AM | Updated on Feb 21 2018 12:48 AM

Reliance has 5% share in Eros International - Sakshi

ముంబై:  ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ మీడియా సంస్థ, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌లో 5 శాతం వాటాను కొనుగోలు చేయనున్నది. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లో లిస్టయిన ఈరోస్‌ ఇంటర్నేషనల్‌లో 5 శాతం వాటాను ఒక్కో షేర్‌ను 15 డాలర్లకు (సోమవారం ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ ముగింపు ధరతో పోల్చితే ఇది 18 శాతం అధికం)రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన అనుబంధ కంపెనీ ద్వారా కొనుగోలు చేయనున్నది. అన్ని భారత భాషల్లో సినిమాలు నిర్మించడానికి,  అన్ని భారత భాషల్లో నిర్మితమవుతున్న సినిమాల డిజిటల్‌ హక్కులను పొందడానికి రిలయన్స్, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీలు చెరో రూ.500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement